English   

నాగ‌బాబు ఇరుక్కున్నాడా.. ఇరికించారా..? 

Naa-peru-surya
2018-05-15 15:31:53

నాగ‌బాబు నిర్మాణానికి దూర‌మై 8 ఏళ్లైపోయింది. అప్పుడెప్పుడో ఆరెంజ్ సినిమా షాక్ ఇచ్చిన త‌ర్వాత త‌న‌కు నిర్మాణం రాద‌ని.. ప‌డ‌ద‌ని ప‌క్క‌కెళ్లి హాయిగా టీవీ షోలు.. సీరియల్స్ చేసుకుంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. ఇక నిర్మాణానికి త‌న‌కు రుణం తీరిపోయింద‌ని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆరెంజ్ ఇచ్చిన షాక్ అలాంటిది మ‌రి. అప్ప‌ట్లోనే దాదాపు 20 కోట్ల‌కు పైగా ముంచేసింది ఈ చిత్రం. దాంతో నాగ‌బాబు ఉన్న‌దంతా పోగొట్టుకుని దాదాపు రోడ్డుమీద‌కు వ‌చ్చేసాడు. ఆ టైమ్ లో అన్న‌త‌మ్ముడు ఆదుకున్నార‌ని చెప్పాడు మెగా బ్ర‌ద‌ర్. కానీ ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ నా పేరు సూర్య అంటూ నిర్మాత‌గా మారాడు ఈ న‌టుడు. ఇప్పుడు ఈ చిత్రం కూడా మ‌ళ్లీ అదే రిజ‌ల్ట్ తీసుకొచ్చింది. నాగ‌బాబు న‌టుడిగా స‌క్సెస్ అయ్యాడేమో కానీ ఇప్ప‌టి వ‌ర‌కు నిర్మాత‌గా మాత్రం కూడ‌బెట్టింది లేదు. ఇన్నేళ్లుగా కాస్తో కూస్తో సంపాదించింది మ‌ళ్లీ ఇప్పుడు బ‌న్నీమీద పెట్టాడు. అది కూడా ఇప్పుడు మ‌ళ్లీ షాకిచ్చింది. నిర్మాత‌గా మ‌రో ఫ్లాప్ అందుకోవ‌డం త‌ప్ప ఇంకేం చేయ‌లేక‌పోయాడు మెగా బ్ర‌ద‌ర్. త‌ను మ‌ళ్లీ నిర్మాత‌గా మార‌డానికి కార‌ణం అల్లు అర‌వింద్ అని ఈ మ‌ధ్య ప్ర‌తీ ఇంట‌ర్వ్యూలో సినిమా విడుద‌ల‌కు ముందు చెప్పాడు నాగ‌బాబు. అంటే ఈ క‌థ ముందే తెలిసి.. ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగాబాబుల‌ను అల్లు అర‌వింద్ సెట్ చేసాడా..? త‌న‌కు అంత‌గా న‌మ్మ‌కం ఉన్న‌పుడు స‌రైనోడు మాదిరి త‌నే నిర్మాత‌గా ఉండొచ్చుగా ఎందుకు నాగ‌బాబును సీన్ లోకి తీసుకు రావ‌డం అంటున్నారు కొంద‌రు. దీనికి స‌మాధానం ఎవ‌రూ చెప్ప‌డానికి ముందుకు రారు. మంచి క‌థ.. ఆడుతుంద‌నుకున్నాం పోయింది అంటున్నారు. మ‌రిప్పుడు నాగ‌బాబు ప‌రిస్థితేంటి..? మ‌ళ్లీ ఆయ‌న్ని జీవితంలో నిర్మాత‌గా చూడ‌గ‌ల‌మా..? పాపం  ఈ మ‌ధ్యే కుదురుకుంటున్న‌ట్లు క‌నిపించిన నాగ‌బాబు.. మ‌ళ్లీ ఫ్లాప్ వ‌చ్చేస‌రికి అస‌లు నిర్మాణం వైపు చూస్తాడా ఇంకా..?

More Related Stories