English   

మీరెన్ని విమర్శలు చేసిన పవన్ శక్తిని నిలువరించలేరు.. 

Naga babu
2020-11-28 16:47:11

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో కూడా పొరపచ్చాలు బయట పడుతున్నాయి. ఇద్దరు నటుల మధ్య ఉన్న మనస్పర్థలు బయటికి వచ్చాయి. ఎప్పుడూ బిజేపీని విమర్శిస్తూనే ఉంటాడు ప్రకాశ్ రాజ్. మోడీ విధానాలపై కూడా ఈయన ఎద్దేవా చేస్తుంటాడు. అలాంటి పార్టీకి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడం ప్రకాశ్ రాజ్ కు అస్సలు నచ్చలేదు. అందుకే నాయకుడిగా సొంత పార్టీని స్థాపించి.. భాజపాకు మద్దతు తెలపడం తనకి అస్సలు నచ్చలేదని ప్రకాశ్ రాజ్ విమర్శలు చేసాడు. పవన్ పై ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పవన్ అభిమానులు కూడా ఈయనపై సోషల్ మీడియాలో మండి పడుతున్నారు. మొన్నీమధ్యే ఓ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌, భాజపా కలయిక గురించి ప్రకాశ్‌ రాజ్‌ ఈ విమర్శలు చేసాడు. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పవన్ సోదరుడు, జనసేన కార్యకర్త నాగబాబు కౌంటర్ ఇచ్చాడు. 

మీ ఒక్కడి అభిప్రాయం వల్ల బిజేపీ, జనసేనకు వచ్చే నష్టమేం లేదని.. మీ నుంచి లాభం కూడా అవసరం లేదని సీరియస్ గా కామెంట్ చేసాడు. భాజపా-జనసేన పొత్తు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తప్పకుండా తమ సత్తా చాటుతుంది.. మీరు చూస్తారంటూ ఆయన కామెంట్ చేసాడు.  రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతుంటాయని నాగబాబు తెలిపాడు. కానీ ఏం నిర్ణయం తీసుకున్నా కూడా అవి ప్రజలకు, పార్టీకి ఉపయోగపడేలా ఉంటే మంచిదని ఆయన తెలిపాడు. ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు, తమ నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా గ్రేటర్ ఎన్నికల్లో బిజేపీకి మద్దతు తెలపడం కూడా అలాంటి ప్రణాళికే అంటున్నాడు నాగబాబు. ఈ పొత్తుతో తమ పార్టీకే కాకుండా ప్రజలకు కూడా మంచి జరుగుతుందని.. విస్తృత ప్రజా, పార్టీ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. 

మీ ఉద్దేశంలో కమలం పార్టీ తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే వాళ్లను సింగిల్ గా విమర్శించండి.. అంతేకానీ పవన్ ను కూడా విమర్శిస్తానంటే ఎలా అంటూ ప్రశ్నించాడు. అంతేకాదు ప్రజలకు మంచి చేస్తున్న పార్టీ ఏదైనా కూడా హర్షించే వ్యక్తిత్వం కూడా ఉండాలని చెప్పాడు నాగబాబు. విమర్శించడం తప్పా హర్షించగలిగే మనసు లేని మీ గురించి ఏం చెప్పగలం అంటూ సీరియస్ కామెంట్ చేసాడు నాగబాబు. అయితే మీరెన్ని అన్నా కూడా ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ దేశానికి భాజపా, ఆంధ్రప్రదేశ్‌కు జనసేనతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని కుండ బద్ధలు కొట్టేసాడు నాగబాబు. మీలాంటి వాళ్లు ఎన్ని విమర్శలు చేసినా భాజపా-జనసేన శక్తిని నిలువరించలేరని ఆయన తెలిపాడు. రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికల తర్వాత మీ లాంటి వాళ్లు వేసే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆయన కౌంటర్ వేసాడు. మరి దీనిపై ప్రకాశ్ రాజ్ మళ్లీ స్పందిస్తాడా లేదంటే లైట్ తీసుకుంటాడా అనేది చూడాలిక.

More Related Stories