English   

నాగచైతన్య సినిమాకు ఏమైంది.. ?

Naga-chaitanya

షూటింగ్ అయిన సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంది. కానీ వీళ్లు మాత్రం రిలీజ్ డేట్ ను మారుస్తున్నాం అని అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. యస్.. నాగ చైతన్య లేటెస్ట్ మూవీ సవ్యసాచి మళ్లీపోస్ట్ పోన్ అయింది. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేటెస్ట్ గా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ షూటింగ్ సంగతి పక్కన బెడితే నిజానికి ఈ సినిమాను ఈ నెల 25నే విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు నాగార్జున ఆఫీసర్ కూడా ఉండటంతో జూన్ కు షిఫ్ట్ అయ్యారు. జూన్ 14 విడుదల అంటూ పోస్టర్స్ కూడా వేశారు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయింది. .జూన్ 14న రావడం లేదు. అంతే కాదు.. అసలు జూన్ లోనే రావడం లేదు. సవ్యసాచి ఏకంగా జూలైకి షిఫ్ట్ అయిపోయాడు. 

నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన మళయాలీ రీమేక్ ప్రేమమ్ తెలుగులోనూ మంచి హిట్ అయింది. దీంతో ఇప్పుడీ ఇద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. పైగా చందుకు ఇది హ్యాట్రిక్ మూవీ. అతను కథలు బాగా రాసుకుంటాడు. క్యారెక్టర్స్ బావుంటాయి. రాసుకున్న కథనూ బాగా నెరేట్ చేస్తాడనే పేరుంది. ఇక సవ్యసాచి అనే టైటిల్ కూడా ఆకట్టుకుంది. ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య ఇలా పోస్ట్ పోన్ అవుతుంటే ఖచ్చితంగా అది సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. ఇక నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో నిన్నటి బ్యూటీ ఫుల్ హీరోయిన్ భూమిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ పోస్ట్ పోన్ కు కారణాలేంటో కానీ.. సినిమా షూటింగ్ మాత్రం పూర్తిగా పూర్తయింది. 

More Related Stories