English   

శైలాజ రెడ్డి అల్లుడిపై అసంతృప్తి

Naga Chaitanya Disappointed After Watched Shailaja Reddy Alludu
2018-08-10 06:28:25

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘శైలజా రెడ్డి అల్లుడు’. అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. శైలజారెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. అయితే లేటెస్ట్ గా  మూవీ రషెస్ చూసిన నాగార్జున సినిమాపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. నిజానికి నాగార్జున నిర్ణయం ఎప్పుడూ తప్పదు. తన ఆఫీసర్ సినిమాకు కూడా ఆయన ఇదే తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నాడు. ఇప్పుడు కూడా తనయుడు చైతూ సినిమాకు సంబంధించి ఇదే అభిప్రాయం వెలిబుచ్చాడనే మాటలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది ఇప్పుడే చెప్పలేం కానీ.. అటు చైతూ కూడా ఈ సినిమా రిజల్ట్ పై పెద్ద నమ్మకంగా లేడట. ఈ విషయంలో తను తప్పు చేశాననే ఫీలింగ్ కూడా అతనికి వెంటాడుతున్నట్టు చెబుతున్నారు. అందుకు కారణం చందు మొండేటి.

నిజానికి ఈ సినిమా కంటే ముందే తనకు ప్రేమమ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేశాడు చైతూ. సవ్యసాచి పేరుతో రూపొందిన ఈ సినిమా శైలజా రెడ్డి అల్లుడు కంటే ముందే ఈ సినిమా పూర్తయింది. కానీ చైతూకు సవ్యసాచి కంటే శైలజారెడ్డి అల్లుడు పైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాడు. బట్ ఈ నమ్మకాన్ని మారుతి వమ్ము చేశాడనే ఫీలింగ్ లో చైతూ ఉన్నాడంటున్నారు. ఈ సినిమా నాగచైతన్య, నాగార్జునకే కాదు.. సమంతకు కూడా పెద్దగా నచ్చలేదంటున్నారు. కారణం.. ఇది మరీ 90స్ ఫార్ములాలోనే సాగుతుందట. ఇప్పుడా ట్రెండ్ అవుట్ డేటెడ్. ఒకవేళ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ ఈ సినిమా విషయంలో రిపీట్ అయి ఏదైనా మిరకిల్ జరిగితే కానీ.. ఈ శైలజా రెడ్డి అల్లుడు హిట్ అయ్యే అవకాశాల్లేవంటున్నారు. మరి ఈ విషయంపై శైలజారెడ్డి మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More Related Stories