English   

చైతూను భ‌య‌పెడుతున్న స‌వ్య‌సాచి..

Naga-Chaitanya
2018-07-20 19:52:38

ఒక్కోసారి మ‌నం బ‌లం అనుకున్న‌ది బ‌ల‌హీనత‌గా మారుతుంది. ఇప్పుడు నాగ‌చైత‌న్య విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న స‌వ్య‌సాచిలో న‌టిస్తున్నాడు ఇప్పుడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఇది మొద‌లుపెట్టిన‌పుడు త‌న కెరీర్ ను మ‌రో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇదే అని న‌మ్మాడు చైతూ. అయితే స‌వ్య‌సాచి ఆల‌స్య‌మ‌వుతున్న తీరు చూసి ఇదే త‌న కెరీర్ కు ఎక్క‌డ అడ్డంకిగా మారుతుందో అని టెన్ష‌న్ కూడా ప‌డుతున్నాడు ఈ హీరో. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ లో ఎప్పుడూ లేనంత బ‌డ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. పైగా ప్రేమ‌మ్ త‌ర్వాత చందూమొండేటితో చైతూ చేస్తోన్న సినిమా ఇది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా భారీగా ఉన్నాయి. ఇందులో ఎడ‌మ చేయితో హీరో బాడీకి సంబంధం ఉండ‌దు. ఇలాంటి క‌థ‌తో నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి వ‌స్తుంది. అంటే రెండు చేతుల‌తోనూ నైపూణ్యం చూపించే వాడు అని అర్థం. భార‌తంలో ఒక్క అర్జునుడికి మాత్ర‌మే ఈ టాలెంట్ ఉంది.
 
అందుకే అత‌డిని స‌వ్య‌సాచి అంటారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్. కుడిచేయికి.. ఎడ‌మ‌చేయికి అస‌లు సంబంధం ఉండ‌దు. తాను చేయాల‌నుకున్న‌ది అది చేస్తూ పోతుంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చైతూ ఎడ‌మ‌చేయికి కూడా కుడిచేయికి ఉన్నంత బ‌లం ఉంటుంది. కానీ ఆ చేయి బాడీ ఆధీనంలో ఉండ‌దు. దీనివ‌ల్ల హీరోకు ఎలాంటి క‌ష్టాలు వ‌చ్చాయి అనేది క‌థ‌. విన‌డానికే చాలా కొత్త‌గా ఉంది ఈ క‌థ‌. దీన్ని స‌రిగ్గా చెబితే తెలుగులో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అయిపోతుంది స‌వ్య‌సాచి. ప్రేమ‌మ్ లాంటి క్లాస్ సినిమా త‌ర్వాత చందూ-చైతూ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న సినిమా ఇది. నిధి అగ‌ర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తుంది.  ఆగ‌స్ట్ లో కూడా ఈ చిత్రం వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. అందుకే ముందుగా మారుతి త‌న శైల‌జారెడ్డి అల్లుడును పంపిస్తున్నాడు. మ‌రి ఇలాగే ఆల‌స్యం అయితే స‌వ్య‌సాచిని కూడా లేట్ సినిమాల లిస్ట్ లో తోస్తారు. 

More Related Stories