English   

అయ్యో రామా.. చైతూ కూడా మెగా దారిలోనే..!

Naga-Chaitanya-Following-Mega-Heroes
2017-05-03 07:50:04

స్టార్ హీరోల సినిమాలు ఆడియో వేడుక‌లు లేకుండా డైరెక్ట్ గా పాట‌లు మార్కెట్ లోకి రావ‌డం చాలా అరుదు. ఎందుకంటే సినిమా విడుద‌ల‌కు ముందు తాము ప‌డ్డ క‌ష్టాన్ని అభిమానుల‌తో పంచుకోడానికి.. సినిమా ప్ర‌మోష‌న్ పెంచుకోడానికి వార‌ధి ఆడియో వేడుక‌. ఇప్పుడు ఆ ఆడియో వేడుక‌లే మాయ‌మైపోతున్నాయి. ఇన్నాళ్లూ ఆడియో ఫంక్ష‌న్ ను గ్రాండ్ గా చేసే స్టార్ హీరోలు.. ఇప్పుడు ఆడియో వేడుక‌ల వైపే క‌న్నేయ‌ట్లేదు. మెగా నిర్మాత అల్లు అర‌వింద్ పుణ్య‌మా అని ఇప్పుడంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ ల‌పై ప‌డ్డారు. త‌న స‌రైనోడు, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు, ధృవ‌, ఖైదీ నెంబ‌ర్ 150, విన్న‌ర్, గురు, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌, మిస్ట‌ర్.. ఇలా ఈ మ‌ధ్య బోలెడ‌న్ని సినిమాలు ఆడియో ఫంక్ష‌న్ లేకుండానే పాట‌లు మార్కెట్ లోకి వ‌చ్చేసాయి. వీట‌న్నింటికి విడుద‌ల‌కు వారం ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా చేసాడు.

ఇప్పుడు ఇదే దారిలో ఇప్పుడు నాగ‌చైతన్య కూడా వెళ్తున్నాడు. ఈయ‌న న‌టిస్తోన్న రా రండోయ్ వేడుక చూద్దాం ఆడియో వేడుక జ‌ర‌గ‌ట్లేదు. ఈ సినిమా తొలి పాట‌ను మే 6న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇదే క్ర‌మంలో మిగిలిన పాట‌ల్ని కూడా విడుద‌ల చేస్తారు. మే మూడో వారంలో ఈ సినిమా విడుద‌ల కానుంది. రేపు మ‌హేశ్ స్పైడ‌ర్ కూడా ఇదే దారిలో వెళ్తే ఆడియో ఫంక్ష‌న్ ల‌కు టాలీవుడ్ దాదాపు దూర‌మైన‌ట్లే అని క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌చ్చు

More Related Stories