English   

ఆర్మీ ఆఫీస‌ర్ లుక్ కోసం చైతూ క‌స‌ర‌త్తులు

Naga Chaitanya
2021-06-24 15:50:02

నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల విడుదల వాయిదా ప‌డింది. ఇక ఈ సినిమా విడుదలకు ముందే నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధ‌మవుతున్నాడు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో లాల్ సింగ్ చద్దా అనే సినిమా వ‌స్తోంది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. 

కాగా ఆర్మీ ఆఫీస‌ర్ లుక్ కోసం ప్ర‌స్తుతం నాగ చైతన్య తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. రెస్ట్ లేకుండా జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో చైతన్య క‌ష్టం బయ‌ట‌ప‌డింది. ఇక‌ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్‌ గంప్‌' కు హిందీ రీమేక్ గా లాల్ సింగ్ చ‌ద్దా సినిమా తెర‌కెక్కుతోంది. వచ్చే నెలలో ఈ సినిమా షెడ్యూల్ లడఖ్ , కార్గిల్‌లో జరగనుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత నాగ చైతన్య 'థాంక్యూ'  సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండ‌గా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి . ఈ సినిమా షూటింగ్ కరోనా వల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాగ చైతన్య మరొక యాక్షన్ సినిమాలో నటించే అవకాశాలున్నాయి.

More Related Stories