English   

చైతూ మరో సినిమా ఒప్పేసుకున్నాడట !

Naga Chaitanya in Merlapaka Gandhi's next
2019-03-25 13:46:17

నాగచైతన్య హీరోగా ఆయన రియల్ వైఫ్ సమంతా హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో 'మజిలీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆయన లవకుశ ఫేం బాబీ దర్శకత్వంలో షూట్ కూడా కానిచ్చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత చైతూ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. అయితే దాని మీద కన్ఫర్ మేషన్ లేదుం అయితే అందుతున్న సమాచారం మేరకు వీరిద్దరి కాంబినేషన్ లో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు సమాచారం. వెంకీమామ షూటింగు పూర్తయిన తరువాత చైతూ ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనున్నాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

 

More Related Stories