English   

నాగచైతన్యలోని ఈ యాంగిల్ ఎవరూ చూసి ఉండరు 

 Naga chaitanya
2020-08-06 09:40:13

ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది. ఒక్క దేశానికో ఒక్క వర్గానికో పరిమితం కాని ఈ కరోనా మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. కరోనాకి చికిత్స కూడా ఖరీదుగా మారిపోయింది. అయినా ఈ కరోన మొదటి రోజు నుండీ డాక్టర్లు ఎంతో కష్ట పడుతున్నారు. కానీ చాలా మంది వారిని ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల వారి మీద దాడులు కూడా చేశారు. దీంతో ఏకంగా కొత్త చట్టం చేశారు అయినా తగ్గడం లేదు. మోడీ పిలుపు మేరకు వారికి పాద పూజలు చేశారు. కానీ అవి పూజల వరకే పరిమితం అయ్యాయి. కానీ కరోనా సోకిన డాక్టర్లను గుర్తించి వాళ్ళ యోగక్షేమాలను కనుక్కున్న సినీ నటుడు కానీ రాజకీయ నాయకుడు కానీ లేడు. కానీ మన నాగ చైతన్య ఆ పని చేసాడు. ఆయన కరోనా నుండి కోలుకున్న డాక్టర్లతో ఒక్క లైవ్ ఇంటర్ యాక్షన్ సెషన్ పెట్టి వారి కోసం సుమారు మూడు గంటల పాటు తన సమయాన్ని వెచ్చించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. 

ఈ సమయంలో ఒక డాక్టర్ మాట్లాడిన మాటలకి నాగ చైతన్య మనసు చలించిపోయింది. డాక్టర్ గా పనిచేస్తున్న తనకి కరోనా సోకితే తన కొడుకు ఇంట్లో నుండి బయటకి తరిమేశాడని చెప్పుక్ల్పచ్చింది. ఆమె మాటలకి చలించిపోయిన నాగ చైతన్య ‘వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు అమ్మ, నేను చూసుకుంటా వాడి సంగతి. నీకు ఎలాంటి సహాయం కావాలి అన్న నీ సొంత కొడుకులా నేను చేసి పెడతాను, నన్ను నీ కొడుకులా భావించు' అంటూ సీరియస్ అయ్యాడు. ఇన్ని రోజులు నాగ చైతన్య చాల సైలెంట్ గా ఉండే వాడుగానే తెలుసు. కానీ ఒక్కసారిగా ఆయనలో ఈ యాంగిల్ చూడటంతో అందరూ ఆశ్చర్యపోయారని చెప్పచ్చు. 

More Related Stories