English   

అల్లుడు మాస్ గా ఉన్నాడ‌బ్బా..!

Naga Chaitanya Looks Very Mass in Shailaja Reddy Alludu Movie
2018-08-02 08:16:27

మారుతి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కులకు ఓ ఐడియా ఉంటుంది. ఆయ‌న సినిమాలో ఏదో ఓ విష‌యాన్ని హైలైట్ చేస్తూ క‌థ సిద్ధం చేస్తుంటాడు. ఈ సారి కూడా నాగ‌చైత‌న్య కోసం అలాంటిదే సిద్ధం చేసాడు. మ‌నిషిలోని గుణాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని క‌థలు రాయ‌డం ఈయ‌న అల‌వాటు. ఈ సారి శైల‌జారెడ్డి అల్లుడుతో వ‌స్తున్నాడు మారుతి. ఇందులో ఇగోను ట‌చ్ చేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇదివ‌ర‌కు ఎన్టీఆర్ టెంప‌ర్ లో ఈగో అంటూ రెచ్చిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ కు ఆ అల‌వాటు పెట్టాడు మారుతి. ప్ర‌తీసారి హీరో బ్రాండ్ పై వెళ్లే ఈ ద‌ర్శ‌కుడు.. ఈ సారి మాత్రం రూట్ మార్చి హీరోయిన్ ను టార్గెట్ చేస్తున్నాడు.

ఇగోతో ఊగిపోయే అమ్మా కూతుళ్ల‌ను అల్లుడు ఎలా ఆడుకున్నాడు అనేది శైల‌జారెడ్డి అల్లుడు క‌థ‌. ఇందులో అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుంది. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ కూడా అదిరిపోయింది. 40 సెక‌న్ల‌లో తానేం చూపించాల‌నుకున్నాడో అన్నీ చూపించాడు ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ఇగో అనేది సినిమాలో ప్ర‌ధానంగా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఆగ‌స్ట్ 31న ఈ చిత్రం విడుద‌ల కానుంది. టీజ‌ర్ లో నాగ‌చైత‌న్య కూడా కొత్త‌గా ఉన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాలో కూడా ఇంత అందంగా లేడు ఈ కుర్ర హీరో. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో చైతూ రేంజ్ ను మారుతి ఎంత‌వ‌ర‌కు మార్చేస్తాడో..? అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది ఇందులో.

More Related Stories