English   

లవ్ స్టోరీ ఇప్పట్లో లేనట్లే.. కరోనా కారణంగా భారీ వాయిదా..

lovestory
2020-04-08 07:05:52

ఫిదా సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలవుతుందని అనుకున్నారు కానీ కరోనా కారణంగా సినిమా బాగానే ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. ఆ మధ్య ఒకే ఒక్క పాటతో ఇప్పుడు లవ్ స్టోరీ రేంజ్ పెంచేసాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. అందులో ఏ పిల్లా అంటూ మరోసారి మాయ చేసింది సాయి పల్లవి. ముఖ్యంగా చైతూను ముద్దు పెట్టే సీన్ అయితే అదుర్స్ అంతే. ప్రేమకథలతో పాటు తనకు నచ్చిన కథలను హృద్యంగా తెరకెక్కిస్తుంటాడు శేఖర్. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా మొదలైన ఈ చిత్ర షూటింగ్ మరి కొన్ని రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటి వరకు ఈయన రొమాంటిక్ కామెడి, లవ్ స్టోరీ లు ఎక్కువగా చేసాడు.. కానీ తొలిసారి ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. పల్లెటూరి నుంచి వచ్చి జీవితంపై ఎన్నో ఆశలతో హైదరాబాద్ వచ్చిన ఇద్దరి కథ ఈ సినిమా అంటున్నాడు శేఖర్ కమ్ముల. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడిగా నటిస్తున్నాడని.. ఆ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడని చెప్పాడు కమ్ముల. ఇక సాయిపల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సమ్మర్ కానుకగా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను సమ్మర్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు శేఖర్ కమ్ముల.

ఈ విషయం తెలిసి సాయిపల్లవి, నాగచైతన్య అభిమానులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఈ సినిమాకు లవ్ స్టోరీ టైటిల్ పెట్టాడు శేఖర్ కమ్ముల. ఇక ఈ సినిమా బిజినెస్ చూస్తుంటే నిజంగానే అందరికీ  పిచ్చెక్కిపోతుంది. చైతు గత సినిమాలతో పోలిస్తే లవ్ స్టోరీ బిజినెస్ భారీగానే జరుగుతుంది. ఫిదా లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఏకంగా 5 కోట్లకు ఈ సినిమాను కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 35 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా. ఈ సినిమాను అనుకున్న తేదీ కంటే కూడా మూడు నాలుగు నెలలు ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తేస్తే ఒకేసారి చాలా సినిమాలు వచ్చి పడతాయి. అందుకే అంతా అయిపోయిన తర్వాత మెల్లగా జూన్ చివర్లో తన ప్రేమకథను తీసుకురావాలని చూస్తున్నాడు శేఖర్ కమ్ముల.

More Related Stories