English   

నాగ్గాడు ఇర‌గ‌దీశాడు

Naga-chaitanya
2018-05-10 16:07:07

నాగ్గాడు ఇర‌గ‌దీశాడు.. ఒక‌ప్పుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు సినిమాలు చూసి ఆయ‌న అభిమానులు ఇలాగే అనుకునేవారు. నాగేశ్వ‌రరావుగారి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఆయ‌న్నిలాగే పిలుచుకునేవారు. అటు ఎన్టీఆర్ ను ఎన్టీవోడు అని క్రుష్ణ‌ను కిట్టిగాడ‌నీ.. ఇలా ముద్దుగా పిలుచుకునేవారు. ఇప్పుడు ఆ పేరునే అలాగే వాడుతూ మ‌హాన‌టి గురించి చెబితే ఇలాగే అనుకోవాలేమో.. య‌స్.. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారి పాత్ర పోషించిన నాగ చైత‌న్య న‌ట‌న‌కూ ఇలాగే ఫిదా అవుతున్నారు ఆడియ‌న్స్. మూగ‌మ‌న‌సులు సినిమాలోని పాట సీన్ లో చైతూ అచ్చంగా తాత‌ను త‌ల‌పించాడు. చాలామంది చైతూను చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అచ్చం తాత‌లానే లేక‌పోయినా.. ఆయ‌న మ‌న‌న‌వ‌డే చేసిన పాత్ర కాబ‌ట్టి.. చాలా త్వ‌ర‌గా.. ఇంకా చెబితే పూర్తిగా చైతూను నాగేశ్వ‌ర‌రావు గారిలాగానే అడాప్ట్ చేసుకుంటుండ‌టం విశేషం.  సో ఆ పాత్ర‌ను ఆ కాలం అభిమానుల మాట‌ల్లో చెప్పుకుంటే నాగ్గాడు ఇర‌గ‌దీశాడ‌నే కదా చెప్పాలి..

నిజానికి ఈ సినిమా టైమ్ లో నాగ చైత‌న్య చాలా బిజీగా ఉన్నాడు. అయినా తాతగారి పాత్ర గెస్ట్ రోల్ గా చేయాలి అంటే వ‌దులుక‌పోలేక‌పోయాడు.ఆ సినిమాల‌కు గ్యాప్ ఇచ్చి మ‌రీ ఈ సినిమాకు కాల్షీట్స్ ఇచ్చాడు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఇప్పుడ రిజ‌ల్ట్ క‌నిపిస్తోంది. నాగేశ్వ‌ర‌రావు గారిలా నాగ చైత‌న్య భ‌లే చేశాడ్రా అని ఈ కాలం ఆడియ‌న్స్ కూడా అనుకునేలా చేసి ఆ పాత్ర‌కో గుర్తింపు తెచ్చాడు.  ప్ర‌స్తుతం చైతూ చేస్తోన్న స‌వ్య‌సాచి ఫినిషింగ్ స్టేజ్ కువ‌చ్చింది. కానీ లేటెస్ట్ గా మ‌రికొన్ని రీ షూట్స్ అవ‌స‌రం అనుకుంద‌ట టీమ్. దీంతో జూన్ లో విడుద‌ల కావాల్సిన సినిమా జూలైకి పోస్ట్ పోన్ అయ్యే అవ‌కాశాలున్నాయంటున్నారు. చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఓ మీనింగ్ ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అని చెబుతున్నారు. మ‌రోవైపు మారుతి ద‌ర్శ‌క‌త్వంలోనూ శైల‌జా రెడ్డి అల్లుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత స‌మంత తో మ‌రో సినిమా కూడా క‌మిట్ అయ్యి ఉన్నాడు. 

More Related Stories