English   

నాగచైతన్య, సమంత.. అది నిజమే

naga chaitanya samantha

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో మోస్ట్ క్రేజీయొస్ట్ కపుల్ గా నాగచైతన్య, సమంతనే చెబుతారు. ప్రేమలో ఉన్నప్పుడు కూడా చాలా డిసిప్లిన్ గా ఉన్నారు. పెళ్లి తర్వాత బాధ్యతగా మెలుగుతున్నారు. ఎవరి కెరీర్ కు ఎవరూ ఇబ్బందిగా మారకుండా మంచి అండర్ స్టాండింగ్ తో వెళుతున్నారు. ప్రస్తుతం చైతూ సవ్యసాచి, శైలాజారెడ్డి అల్లుడు అనే సినిమాల్లో నటిస్తోంది. ఇటు సమంత కూడా రంగస్థలం, తమిళంలో ఇరుంబుతిరై సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాల విషయంలో సమంత యాక్టింగ్ పార్ట్ పూర్తయింది. ఈ నేపథ్యంలో చైతూ, శామ్ విషయంలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారనేదే ఆ వార్త.

లాస్ట్ ఇయర్ నాని హీరోగా నిన్నుకోరి అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణతో నాగచైతన్య సినిమా చేయబోతున్నాడు. ఇది కూడా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. అయితే ఈసినిమాలో ముందు నుంచీ సమంత నటిస్తోందనే మాటలు వినిపిస్తున్నాయి. యస్.. అది నిజమే. సమంత నటిస్తోంది. కానీ హీరోయిన్ గా కాదు.. కేవలం ఓ గెస్ట్ రోల మాత్రమే చేస్తోంది. అది కూడా చాలా చిన్న పాత్రని సమాచారం. ఆల్మోస్ట్ ఇది కన్ఫార్మ్ కానీ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ కావడమే లేట్ అంటున్నారు. ఇక ఈ కథ రాసుకుంటున్నప్పుడే ఈ గెస్ట్ రోల్ కు సమంతే కావాలని రాసుకున్నాడట సదరు దర్శకుడు. ఈ విషయం కథ వింటున్నప్పుడు చైతూకు కూడా అనిపించదట. అందుకే అతనూ ఓకే చెప్పాడు. దీంతో ఈ శామ్ ఈ ప్రాజెక్ట్ గెస్ట్ కాబోతోన్న మాట నిజమైంది. అయితే వీరి స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఉంటుందా.. లేక వేర్వేరుగా ఉంటుందా అనేది తెలియదు.. మొత్తానికి ఈ ఇద్దరూ కలిసి ఏ మాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం సినిమాలు చేశారు. మూడు మంచి పేరే తెచ్చాయి ఇద్దరికీ.

More Related Stories