English   

ఎన్టీఆర్ డైరెక్టర్ తో అక్కినేని హీరో..?

bobby-chaitanya
2018-03-16 10:30:05

హిట్ సినిమా తీసినా ఇంకో సినిమా రావడానికి టైమ్ పడితే ఆ దర్శకుడంత బ్యాడ్ లక్ ఎవరికీ ఉండదు. ఫస్ట్ మూవీతోనే దర్శకుడిగా పవర్ చూపించిన కుర్రాడు బాబీ. తర్వాత పవన్ కళ్యాణ్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ చేశాడు. లక్కీగా ఆ ఫ్లాప్ ఇతనిపై ప్రభావం చూపించలేదు. ఈ టైమ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ చాన్స్ అందుకున్నాడు. అవకాశాన్ని హిట్ తో యూజ్ చేసుకున్నాడు. జై లవకుశ వచ్చి హాఫ్ ఇయర్ దాటుతున్నా బాబీకి మరో హీరో చాన్స్ ఇవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు అతనికో హోప్ కనిపిస్తోంది. అక్కినేని యంగ్ స్టార్ నాగచైతన్య, బాబీకి చాన్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

జై లవకుశ తర్వాత బాబీ కూడా చైతూకు సరిపోయే కథ రాసుకున్నాడు. అతనితోనే సినిమా చేయాలనే ఇన్నాళ్లూ వెయిట్ చేసినట్టు చెప్పుకుంటున్నాడు. ఫైనల్ గా బాబీ నిరీక్షణ ఫలించేలానే ఉంది. బాబీకి నిర్మాత కూడా సిద్ధంగానే ఉన్నాడు. దీంతో అతని కథ చైతూ వింటున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ కథపై చర్చలు చేస్తున్నారు. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రస్తుతం కూల్ మూవీస్ తో మంచి హిట్స్ కొడుతోన్న చైతూకు ఎప్పటి నుంచో యాక్షన్ సినిమాతో హిట్ కొట్టాలనే కోరిక ఉంది. ఇప్పటి వరకూ ఆ తరహా సినిమాలు చాలానే చేసినా ఒక్కటీ హిట్ ఇవ్వలేదు. దీంతో బాబీతో అయినా ఓ మాస్ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు చైతూ. చిన్న చిన్న మార్పులతో ఈ కథ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టే అంటున్నారు. 

కాకపోతే ప్రస్తుతం నాగ చైతన్య ఇప్పుడు కంటిన్యూస్ గా రెండు సినిమాలు చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో సవ్యసాచి చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో శైలజారెడ్డి అల్లుడు చేస్తున్నాడు. దీని తర్వాత నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణతో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో మరోసారి సమంతతో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. మరి ఈ మూడు పూర్తయిన తర్వాత లేదా మొదటి రెండూ పూర్తైతే కానీ బాబీ వంతు రాదు. అంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా పట్టాలెక్కడానికి ఇంకో ఆరు నెలలు ఈజీగా పడుతుందనుకోవచ్చు. 
 

More Related Stories