English   

పూరీ ఈ కథ నమ్మాలా...

Puri-Jagannath

పూరీ జగన్నాథ్.. ఇప్పుడు ఫేడవుట్ కు దగ్గరలో ఉన్న దర్శకుడు. లేటెస్ట్ గా తనయుడు ఆకాశ్ పూరీతో చేసిన మెహబూబా కూడా పోయింది. దీంతో ఇకపై పూరినీ ఏ హీరో నమ్మే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ క్యాంప్ నుంచి మరో కథ వినిపిస్తోంది. పూరీ త్వరలోనే ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నాడనేదే ఆ కథ. అయితే ఈ కథ వింటేనే తెలుస్తుంది. ఇదంతా వట్టి రూమర్ అని. మరి ఈ రూమర్ ఎవరు పుట్టించారనేది వేరే చెప్పక్కర్లేదు. గతంలో కూడా మహేష్ బాబుతో జనగనమణ స్టార్ట్ అవుతుందంటూ పూరీ కొన్నాళ్లు హల్చల్ చేశాడు.కానీ అది వర్కువుట్ కాలేదు. దీంతో ఇప్పుడు రూమర్ రాయుళ్ల కన్న అక్కినేని క్యాంప్ పై పడింది. 

లేటెస్ట్ గా వినిపిస్తోన్న వార్తలను బట్టి పూరీ జగన్నాథ్ ఓ భారీ మల్టీస్టారర్ కు రంగం సిద్ధం చేశాడు. ఆ మల్టీస్టారర్ లో అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్నారు అనేదే ఈ రూమర్ సారాంశం. మామూలుగా ఆలోచించినా.. సినిమాల పరంగా పక్కా బిజినెస్ మేన్ లా ఆలోచించే నాగార్జన ఇప్పుడు పూరీకి చాన్స్ ఇస్తాడా.. అసాధ్యం. ఒకవేళ ఇచ్చినా ఈ మల్టీస్టారర్ లో నటించడానికి ఇప్పుడు నాగచైతన్య ఖాళీగా ఉన్నాడా..? లేడు. మరి ఇంకా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేదెక్కడ. కదా.. అంటే దీన్ని బట్టి పూరీ జగన్నాథ్ పని అప్పుడే అయిపోలేదని ఇన్ డైరెక్ట్ గా తెలియజేయడానికే ఇలాంటి వార్తలు వస్తున్నాయనే కదా. 

ఇక పూరీ మాత్రం బాలయ్య మీదే ఆశలు పెట్టుకుని ఉణ్నాడనేది నిజం. పైసా వసూల్ లాంటి మరో సినిమా బాలయ్యతో చేయాలనే కోరిక ఆయనకు ఉంది. అందుకే ఈ మధ్య మాట్లాడితే జై బాలయ్య అంటున్నాడు. మరి ఈ పొగడ్తలకు బాలయ్య పడతాడేమో కానీ.. నాగార్జున పడడు.. ఒకవేళ బాలయ్య పడ్డా.. ఆయనా ఇప్పుడు ఖాళీగా లేడు. అందుకే పూరీ చెప్పే కథలు నమ్మడానికి ఇప్పుడు స్టార్ హీరోలెవరూ సిద్ధంగా లేరు అనేది నిజం. 

More Related Stories