English   

రమ్యకృష్ణ పాటలో రకుల్ ప్రీత్ సింగ్

Naga-Chaitanya
2018-04-12 18:27:57

ఇన్నాళ్లూ ఇది మెగా ఫ్యామిలీలోనే ఉందనుకున్నాం.. ఇక మెల్లగా అక్కినేని వారబ్బాయికీ అంటుకుంటోంది. ఆల్రెడీ తాత పాటను మనంలో రీమిక్స్ చేసిన చైతూ.. త్వరలో తండ్రి పాటనూ  రీమిక్స్ చేయబోతున్నాడు. ఈ మిక్స్ లకు ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోన్న రీమిక్స్ ఆపడం లేదు మెగా హీరోలు. సో ఇప్పుడు చైతూ వంతు వచ్చిందన్నమాట.  ప్రస్తుతం నాగ చైతన్య.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చందు మొండేటి డైరెక్షన్ లో సవ్యసాచి అనే సినిమా చేస్తున్నాడు. ఇందులోనే తండ్రి పాటను రీమిక్స్ చేయబోతున్నాడు చైతూ. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ రీమిక్స్ లో ఓ టాప్ హీరోయిన్ ఐటమ్ డ్యాన్స్ చేయబోతోంది. 

చాలాయేళ్ల క్రితం నాగార్జున హీరోగా వచ్చిన మాసీ ఎంటర్టైనర్ అల్లరి అల్లుడు గుర్తుందా. ఆ సినిమాలో వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ సాంగ్ నే ఇప్పుడు చైతూ రీమిక్స్ చేయబోతున్నాడు. ఇంతకీ ఆ పాటేంటో తెలుసా.. నిన్ను రోడ్డుమీద చూసినదీ లగాయత్తూ అనే పాట. ఈ పాట అప్పట్లో కుర్రాళ్లను ఓఊపు ఊపేసింది. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను సవ్యసాచిలో రీమిక్స్ చేయబోతున్నారు. ఆ మిక్స్ లో వచ్చే స్టెప్పలు రకుల్ ప్రీత్ సింగ్ వేయబోతోంది. అప్పుడు ఇదే పాటలో రమ్యకృష్ణ నర్తించడం విశేషం. కాలేజ్ ఫంక్షన్ లో ఓ సినిమా హీరోయిన్ తో డ్యాన్స్ చేయించడం అనే కాన్సెప్ట్ గా వచ్చే ఈ పాటను ఇప్పుడు అదే రూట్ లో రకుల్ చేయబోతోంది. ఆల్రెడీ రకుల్, చైతూ కాంబినేషన్ లో వచ్చిన రారండోయ్ వేడుకచూద్దాం సినిమా సూపర్ హిట్. సో ఇప్పుడీ పాటలో వీరి కెమిస్ట్రీ కూడా అదిరిపోతుందని వేరే చెప్పక్కర్లేదు. 

More Related Stories