English   

 ఏంటి చైతూ ఆ స్పీడ్.. కాస్త చూస్కో..!

Naga-CHaitanya

ఒక‌టి రెండు మూడు అంటూ లెక్క పెట్టుకుంటూ వెళ్లిపోతున్నాడు నాగ‌చైత‌న్య‌. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొత్త‌వి ఒప్పుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మ‌రో సినిమా కూడా చైతూ ఖాతాలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం స‌వ్య‌సాచి సినిమాతో బిజీగా ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. ఈ చిత్ర షూట్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. జూన్ 14న సినిమా విడుద‌ల కానుంది. మార్చ్ 16న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. చందూమొండేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇక సవ్య‌సాచి సెట్స్ పై ఉన్న‌పుడే మారుతి శైలజారెడ్డి అల్లుడుకు ఓకే చెప్పాడు నాగ‌చైత‌న్య‌. ఇందులో అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ స‌వ్య‌సాచి త‌ర్వాత మొద‌లు కానుంది. ఇదింకా ప‌ట్టాలెక్క‌నే లేదు.. ఈ మ‌ధ్యే శివ‌నిర్వాణ సినిమా కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు నాగ‌చైత‌న్య‌. 

ఇందులో భార్య స‌మంత‌తోనే క‌లిసి న‌టించ‌బోతున్నాడు ఈ హీరో. నిన్నుకోరితో గుర్తింపు తెచ్చుకున్న శివ‌.. త‌న స్క్రిప్ట్ తో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ను మెప్పించాడు. ఈ చిత్రాన్ని నానితో కృష్ణార్జున యుద్ధం నిర్మిస్తోన్న సాహు గుర‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ మూడు సినిమాలు లైన్ లో ఉండ‌గా ఇప్పుడు మ‌రో సినిమా కూడా చైతూ ద‌గ్గ‌రికి వ‌చ్చింది. అదే బాబీ సినిమా. జై ల‌వ‌కుశ త‌ర్వాత మ‌రో సినిమా అనౌన్స్ చేయ‌ని బాబీ.. ఇప్పుడు నాగ‌చైత‌న్య కోసం క‌థ సిద్ధం చేసాడు. ఈ చిత్రాన్ని ర‌వితేజ‌తో ప్ర‌స్తుతం నేల‌టికెట్ సినిమా నిర్మిస్తున్న ఎస్ఆర్టీ క్రియేష‌న్స్ నిర్మించ‌నున్నారు. ఇన్ని సినిమాలు ఉండ‌గానే ఓ లేడీ డైరెక్ట‌ర్ తోనూ నాగ‌చైత‌న్య‌కు క‌మిట్ మెంట్ ఉంద‌ని తెలుస్తుంది. మొత్తానికి ఒకేసారి ఇన్ని సినిమాల‌తో ర‌చ్చ చేస్తున్నాడు చైతూ. మ‌రి ఇందులో ఎన్ని ఈయ‌న కెరీర్ కు బాగా హెల్ప్ అవుతాయో చూడాలిక‌..!

More Related Stories