English   

చైతూ నువ్ సూపరంతే

Naga-Chaitanya
2018-04-20 15:31:22

నాగ చైతన్య.. కొంతకాలం క్రితం ఎలాంటి ఇమేజ్ లోకి వెళ్లాలా అని ఇబ్బందిపడ్డాడు. కానీ ప్రేమమ్ తో తను ఎలాంటి సినిమాలు చేస్తే ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారో తెలుసుకున్నాడు. అందుకే వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్, సబ్జెక్ట్స్ తో వెళుతున్నాడు. మధ్యలో యుద్ధంశరణం అన్నాడు కానీ అప్పుడూ కుదరదు అనేశారాడియన్స్. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు చైతూ. ప్రేమమ్ తో తన కెరీర్ ను కొత్త టర్న్ ఇచ్చిన చందు మొండేటి డైరెక్షన్లో సవ్యసాచితో పాటు మారుతి డైరెక్షన్ లో శైలాజా రెడ్డి అల్లుడు అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకూ డేట్స్ ఇచ్చి ఒకేసారి రెండు షూటింగ్స్ లో పాల్గొంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు చైతూ..  సవ్యసాచి అంటే అర్థం తెలుసు కదా.. రెండు చేతులనూ ఏకకాలంలో ఏకబలంతో ఉపయోగించగలవాడని. అలాగే ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ ఒకేరకమైన ఎనర్జీని ఇస్తూ తను రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ సవ్యసాచి అనిపించుకుంటున్నాడు చైతూ. ప్రస్తుతం శైలాజారెడ్డి అల్లుడు సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. శైలాజా రెడ్డిగా ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తుండటం విశేషం. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న శైలాజా రెడ్డి కాస్త లేట్ గా సవ్యసాచి ముందుగా విడుదల కానుంది. ఏదేమైనా ఇతర ఆర్టిస్టులకైతే ఏమోకానీ.. ఓ హీరో ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేయడం ఈ మధ్యకాలంలో ఇబ్బందిగా ఫీలవుతున్నారు చాలామంది. కానీ చైతూ చేస్తూ.. ఇతర హీరోలకు భిన్నంగా వెళుతున్నాడు.
 

More Related Stories