English   

చైతూ కు అడ్డంకిగా మారిన కేర‌ళ వ‌ర‌ద‌లు

Naga Chaitanya's Shailaja Reddy Alludu Movie Release Postponed
2018-08-21 06:21:57

ఇప్పుడు ఎక్క‌డా విన్నా కేర‌ళ బాధితుల ఆర్త‌నాదాలే వినిపిస్తున్నాయి. వాళ్ల గోడు ప‌ట్టించుకునే వాడే లేడు. పోటెత్తిన వ‌ర‌ద‌ల కార‌ణంగా కేర‌ళ అతలాకుత‌లం అయిపోయింది. ఈ వ‌ర‌ద‌ల్లో సినిమా ఇండ‌స్ట్రీకి కూడా షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఇప్పుడు నాగ‌చైత‌న్య కూడా దీనికి బాధితుడు అయిపోయాడు. ఈయ‌న న‌టిస్తున్న శైల‌జారెడ్డి అల్లుడు సినిమా ఆగ‌స్ట్ 31న విడుద‌ల కావాల్సి ఉండ‌గా.. ఇప్పుడు అది వాయిదా ప‌డి పోయింది. దీనిపై నాగ‌చైత‌న్య కూడా క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు. కొత్త తేదీని నిర్మాత‌లే త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తార‌ని ట్వీట్ చేసాడు చైతూ. దీనికి కార‌ణం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల‌స్యం కావ‌డ‌మే. అది ఎందుకు ఆల‌స్యం అవుతుందంటే కేర‌ళ‌కు వ‌ర‌ద‌లు రావ‌డ‌మే.. అలా ఎందుకు అంటే ఈ సినిమాకు సంగీతం అందించేది గోపీసుంద‌ర్ కావ‌డ‌మే.. ఆయ‌న కేర‌ళ వాడు కావ‌డం దీనికి అస‌లు మూలం. అక్క‌డే ఆయ‌న స్టూడియోలు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు ఆర్ఆర్ ఇస్తున్నాడు గోపీ. కానీ ఇప్పుడు అనుకోని వర‌ద‌ల కార‌ణంగా ప‌ని కూడా చేయ‌లేక‌పోతున్నాడు ఈ సంగీత ద‌ర్శ‌కుడు. దాంతో ముందే విడుద‌ల తేదీని మార్చుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డ‌టంతో ఆగ‌స్ట్ 30న రానున్న న‌ర్త‌న‌శాల‌కు పండ‌గే పండ‌గ ఇంక‌. సోలోగా బాక్సాఫీస్ దున్నేసుకోవ‌చ్చు. 

More Related Stories