English   

క‌ణంపై శౌర్య కోపం..

Naga-Shaurya-Kanam

ఛ‌లో సినిమాతో త‌న మార్కెట్ బాగానే పెంచుకున్నాడు నాగ‌శౌర్య. ఈ హీరోకు ఇప్పుడు కానీ మ‌రో హిట్ ప‌డితే క‌చ్చితంగా మార్కెట్ మ‌రింత పెరిగి పోవ‌డం ఖాయం. స‌రిగ్గా ఇలాంటి టైమ్ లో క‌ణం సినిమాతో వ‌స్తున్నాడు నాగ‌శౌర్య‌. ఛ‌లో టైటిల్ లో నాగ‌శౌర్య ఛ‌లో అని ఉంటుంది. కానీ ఇక్క‌డ మాత్రం సాయిప‌ల్ల‌వి క‌ణం అని ఉంది. ఇదే ఇప్పుడు ఈ హీరోకు న‌చ్చ‌డం లేదేమో అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌కు నాగ‌శౌర్య రాలేదు. షూటింగ్ టైమ్ లో ప‌ల్ల‌వితో బాగానే ఇబ్బందులు ప‌డ్డాడు ఈ హీరో. ఈ విష‌యాన్ని ఓపెన్ గానే చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు నాగ‌శౌర్య‌. త‌న‌కు సాయిప‌ల్ల‌వి తీరు చుక్క‌లు చూపించింద‌ని చెప్పాడు ఈ కుర్ర హీరో. దాంతో ప‌ల్ల‌వి కూడా షాక్ అయింది. త‌ను ఏ విధంగా శౌర్య‌ను ఇబ్బంది పెట్టానో ఇప్ప‌టికీ అర్థం కావ‌ట్లేదని.. ద‌ర్శ‌కున్ని కూడా ఈ విష‌యంపై క్లారిటీగా అడిగాన‌ని చెప్పింది సాయిప‌ల్ల‌వి. ఇంత జ‌ర‌గ‌డంతో ప‌ల్ల‌వి కానీ హ‌ర్ట్ అయి క‌ణం సినిమాను తెలుగులో ప‌ట్టించుకోదు.. ప్ర‌మోట్ చేయ‌దు అనుకున్నారంతా. ఎందుకంటే ఎంసిఏ టైమ్ లో ఇదే జ‌రిగింది మ‌రి. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అవుతుంది. విచిత్రంగా క‌ణం ప్రీ రిలీజ్ వేడుకకు సాయిప‌ల్ల‌వి వ‌చ్చింది.. కానీ నాగ‌శౌర్య రాలేదు. దాంతో క‌ణంపై శౌర్య‌కు కోపం వ‌చ్చింద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి చూడాలిక‌.. రేపు ప్రమోష‌న్ల‌కు అయినా ఈ కుర్ర హీరో వ‌స్తాడో రాడో..? 

More Related Stories