English   

భవ్య క్రియేషన్స్ లో శౌర్య

Naga-shaurya

హీరోగా నిలబడాలని చాలాకాలంగా ట్రై చేస్తున్నాడు నాగశౌర్య. మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా.. అవేవీ అతనికి స్టార్డమ్ ఇచ్చేంత పెద్ద విజయాలు కాలేకపోయాయి. మరోవైపు కొత్త హీరోలు, వారసత్వపు బ్యాచ్ అంతా దూసుకువస్తున్నారు. దీంతో ఇలాగైతే కష్టం అనుకుని తనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఛలో చేశాడు. లక్కీగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది. అతని కెరీర్ కొత్త బూస్టప్ ఇచ్చేస్తూ ఛలో మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దీంతో ఇకపై చేయబోయే సినిమాల విషయంలో ఆచితూచి స్క్రిప్ట్ లు వేస్తున్నాడు శౌర్య. 

ప్రస్తుతం నాగశౌర్య నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కణం.. రెండోది అమ్మమ్మగారిల్లు. వీటిలో అమ్మమ్మగారిల్లుపై శౌర్యకు మంచి నమ్మకం ఉంది. నర్తనశాల అనే సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. మరో  సినిమా సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ తో చేయబోతున్నాడు. అయితే హోమ్ బ్యానర్ సినిమా కొద్ది రోజుల్లో స్టార్ట్ అవుతోంది. కిర్రాక్ పార్టీ హీరోయిన్ ను హీరోయిన్ గా, అలాగే సాగర్ మహతిని సంగీత దర్శకుడిగా ఫిక్స్ చేసుకున్నారు. డైరక్టర్ శ్రీనివాస చక్రవర్తి.  ఇప్పుడు మరో సినిమాకు బీజం పడింది. సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన పేద్ద బ్యానర్ భవ్య ఆర్ట్స్ సంస్థ త్వరలో ఓ సినిమాను నాగశౌర్య హీరోగా నిర్మించడానికి రంగం సిద్దం అయింది. ఈ మేరకు అడ్వాన్స్ లు, అగ్రిమెంట్లు జరిగిపోయాయి. అయితే డైరక్టర్, సబ్జెక్ట్ ఫిక్స్ కావాలట అదే ట్విస్ట్. అవేవీ సిద్ధం కాకుండానే కుర్రాడ్ని బ్యాకప్ చేసుకున్నారంటే ఖచ్చితంగా శౌర్య రేంజ్ పెరుగుతుందనే అంచనా వేసినట్టే కదా.  అంటే విడుదలకు రెడీగా రెండు, నిర్మాణానికి రెడీగా మూడు ప్రాజెక్టులు అన్నమాట.  

More Related Stories