English   

దర్శకుడికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇస్తోన్న హీరో..

Naga-Shaurya-gift

హిట్ ఇచ్చిన దర్శకుడికి గిఫ్ట్ ఇవ్వడం ఈ మధ్య టాలీవుడ్ లో ఓ ట్రెండ్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడని.. కొరటాల శివకు కాస్ట్ లీ కార్ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఎన్నాళ్లుగానో ఓ హిట్ కోసం వెయిట్ చేస్తోన్న నాగశౌర్య కూడా తనకు ఫస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములకు ఓ ఖరీదైన కార్ బహూకరించబోతున్నాడు. ఆల్రెడీ ఈ కార్ ఆర్డర్ ఇచ్చారట. సినిమా రిలీజ్ అయి రెండో వారం చివరికి వచ్చినా వసూళ్లూ స్టడీగానే ఉన్నాయి. సొంతంగా బ్యానర్ స్థాపించిన నాగశౌర్య నమ్మకాన్ని నిలబెట్టడమే కాదు.. తన కెరీర్ లోనే ఫస్ట్ అండ్ బెస్ట్ హిట్ ఇచ్చాడన్న కృతజ్ఞతతోపాటు శౌర్యకు వెంకీ చాలాకాలం నుంచీ ఫ్రెండ్ ట. ఈ కారణంగానే కార్ గిఫ్ట్ ఇస్తున్నట్టు టాక్. ఏదేమైనా స్టార్ హీరోల ట్రెండ్ ను కంటిన్యూస్ చేస్తూ దర్శకుడి ప్రతిభకు ప్రశంసాపూర్వకంగా కార్ ఇస్తోన్న శౌర్య ను అభినందించాల్సిందే. 

More Related Stories