English   

ఒక్క హిట్టుకే నాలుగు కోట్లా బాబూ..?

Naga-Shaurya

ఒక్క హిట్టు ప‌డితే చాలు.. యంగ్ హీరోలు రెచ్చిపోతున్నారు. అమాంతంగా రేట్ పెంచేస్తూ నిర్మాత‌ల‌ను బెంబేలెత్తిస్తున్నారు. ఒక‌ర‌కంగా ఈ త‌రం హీరోల‌తో స‌రికొత్త క‌థ‌ల‌తో సినిమాలు చేయాల‌నుకుంటోన్న న‌వ‌త‌రం ద‌ర్శ‌కులకూ వీరు దూరం అవుతోంది ఈ కార‌ణంగానే. ఇన్నాళ్లూ ఒక్క హిట్టు కోసం చ‌కోర ప‌క్షిలా చూసిన నాగ‌శౌర్య ఛ‌లోత‌ర్వాత త‌న రెమ్యూన‌రేష‌న్ భారీగా పెంచేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఎన్ని సినిమాలు చేసినా ఈ హీరోకు క‌లిసి రాలేదు. కానీ సొంత బ్యాన‌ర్ లో సినిమా ఛ‌లోతో సాలిడ్ హిట్ కొట్టాడు. దీంతో చాలామంది ద‌ర్శ‌కులు శౌర్య కు క‌థ‌లు చెప్ప‌డం మొద‌లుపెట్టారు. అయితే అత‌ను క‌థ‌లు ఓకే చేయ‌డం కంటే ముందే రెమ్యూన‌రేష‌న్ చెబుతుండ‌టంతో ఓ మోస్త‌రు బ‌డ్జెట్ తో లాగించాల‌నుకుంటోన్న ద‌ర్శక నిర్మాత‌లంతా కామ్ గా సైడ్ అయిపోతున్నార‌ని టాక్. నాలుగు కోట్లు అడిగినా ఇవ్వ‌డానికి కొంద‌రు సిద్ధ‌మైనా.. అత‌ను ఇప్పుడప్పుడే ఖాళీగా లేడు. దీంతో అత‌ని డిమాండ్స్ గురించి బ‌య‌ట కాస్త నెగెటివ్ గా మాట్లాడుత‌న్నార‌ట‌. ఒక‌ర‌కంగా చూస్తే నాగ‌శౌర్య కూడా క‌రెక్టే అనిపిస్తుంది. ఇన్నాళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాడు. మంచి టాలెంట్ ఉంది. కొత్త క‌థ‌లూ ట్రై చేశాడు. మ‌ల్టీస్టార‌ర్ కూ ఓకే చెప్పాడు. అయినా ఇన్నాళ్లూ పెద్ద‌గా ప‌ట్టించుకోని వాళ్లు ఇప్పుడు ఒక్క హిట్ ప‌డ‌గానే క్యూ క‌డుతున్నారు. మ‌రి వారి క్యూరియాసిటీని క్యాష్ చేసుకోవాల‌నుకోవ‌డంలో త‌ప్పేముందీ అనేవారూ లేక‌పోలేదు. మ‌రోవైపు ప్ర‌స్తుతం తను నాలుగు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఒక‌టి వివాదంలో ఉంది. అంటే మ‌నోడికి డిమాండ్ బాగా పెరిగిన‌ట్టే క‌దా. అంటే డిమాండ్ ఉన్న‌ప్పుడే రేట్ పెంచ‌గ‌లిగేది. సో.. టైమ్ ఉన్న‌ప్పుడే మ‌నీ చేసుకోవాల‌నే ఇండ‌స్ట్రీ సూత్రం ఇత‌నూ ఫాలో అవుతున్నాడ‌నుకోవ‌చ్చు.

More Related Stories