English   

నాగ‌శౌర్య మ‌ళ్లీ సొంతంగానే..

Naga Shaurya home production

ఒక్క‌సారి గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత వెన‌క్కి రావ‌డం క‌ష్టం. ఇన్నాళ్లూ నాగ‌శౌర్య‌కు అది ఎలా ఉంటుందో పెద్ద‌గా తెలియ‌దు. వ‌చ్చిన స‌క్సెస్ లు కూడా అర‌కొర‌గానే వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే ఛ‌లోతో నిఖార్సైన విజ‌యం అందుకున్నాడు నాగ‌శౌర్య‌. అది కూడా సొంత బ్యాన‌ర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒక‌టి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మంచి లాభాలు తీసుకొచ్చింది. బ‌య‌టి బ్యాన‌ర్స్ లో చేయ‌డం వ‌ల్ల త‌న సినిమాలు స‌రైన ప్ర‌మోష‌న్ లేక పోయాయంటున్నాడు శౌర్య‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జాదూగాడు.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలు పోవ‌డానికి కార‌ణాలు స‌రైన టైమ్ లో రిలీజ్ కాక‌పోవ‌డ‌మే అంటున్నాడు శౌర్య‌. అందుకే సొంతబ్యాన‌ర్ లో సినిమాలు చేయ‌డానికి  ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ హీరో. 
ఇప్పుడు కూడా త‌న బ్యాన‌ర్ లోనే సినిమా చేయ‌బోతున్నాడు శౌర్య‌. ఇప్ప‌టికే శ్రీ‌నివాస‌మూర్తి అనే కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ శౌర్య‌కు బాగా న‌చ్చేసింది. అలాగే చ‌లోకు సినిమాటోగ్ర‌ఫీ అందించిన సాయిశ్రీ‌రామ్ ను కూడా ద‌ర్శ‌కుడిగా లాంచ్ చేస్తున్నాడు ఈ హీరో. సాయి సినిమాను బ‌య‌టి బ్యాన‌ర్ లోనే చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మిగిలిన సినిమాలు మాత్రం త‌న సొంత సంస్థ‌లోనే చేయ‌బోతున్నాడు ఈ కుర్ర హీరో. అంతేక‌దండీ.. బ‌య‌టి సంస్థ‌ల్లో చేసి అది క‌రెక్ట్ గా ప్ర‌మోట్ చేయ‌లేక అన‌వ‌స‌రంగా ఫ్లాపులు తెచ్చుకోవ‌డం కంటే మ‌నమే సొంతంగా ఓ సంస్థ నిర్మించుకుంటే స‌రిపోతుంది క‌దా..? అదే ఇప్పుడు నాగ‌శౌర్య కూడా చేస్తున్నాడు. మ‌రి ఇలాగే సొంత సంస్థ‌లో సినిమాలు చేస్తూ శౌర్య స్టార్ గా మారి పోతాడేమో చూడాలిక‌..!

More Related Stories