English   

న‌ర్త‌న‌శాల‌.. కుర్రాడిలో శౌర్యం క‌నిపిస్తుంది..!

Naga-Shaurya
2018-07-21 10:45:34

ఒక్క‌సారి గెలుపు రుచికి అల‌వాటు ప‌డిన త‌ర్వాత వెన‌క్కి రావ‌డం క‌ష్టం. ఇన్నాళ్లూ నాగ‌శౌర్య‌కు అది ఎలా ఉంటుందో పెద్ద‌గా తెలియ‌దు. వ‌చ్చిన స‌క్సెస్ లు కూడా అర‌కొర‌గానే వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే ఛ‌లోతో నిఖార్సైన విజ‌యం అందుకున్నాడు నాగ‌శౌర్య‌. అది కూడా సొంత బ్యాన‌ర్ లోనే. ఐరా సంస్థ అంటూ ఒక‌టి క్రియేట్ చేసి.. అందులోనే సినిమా చేసాడు శౌర్య‌. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. మంచి లాభాలు తీసుకొచ్చింది. బ‌య‌టి బ్యాన‌ర్స్ లో చేయ‌డం వ‌ల్ల త‌న సినిమాలు స‌రైన ప్ర‌మోష‌న్ లేక పోయాయంటున్నాడు శౌర్య‌. ఆ మ‌ధ్య వ‌చ్చిన జాదూగాడు.. క‌ళ్యాణ వైభోగ‌మే లాంటి సినిమాలు పోవ‌డానికి కార‌ణాలు స‌రైన టైమ్ లో రిలీజ్ కాక‌పోవ‌డ‌మే అంటున్నాడు శౌర్య‌. అందుకే సొంతబ్యాన‌ర్ లో సినిమాలు చేయ‌డానికి  ఆస‌క్తి చూపిస్తున్నాడు ఈ హీరో. 

ఇప్పుడు కూడా త‌న బ్యాన‌ర్ లోనే సినిమా చేస్తున్నాడు శౌర్య‌. ఇప్ప‌టికే శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి అనే కొత్త ద‌ర్శ‌కుడితో న‌ర్త‌న‌శాల సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైందిప్పుడు. ఇందులో నాగ‌శౌర్య‌ను చూస్తుంటే మ‌రో హిట్ వ‌స్తుంది.. రాసి పెట్టుకోండ‌ని ప‌క్కాగా చెబుతున్న‌ట్లు అనిపిస్తుంది. ఆ క‌ళ్ల‌లో కాన్ఫిడెన్స్ అలా ఉంది. ఈ చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇందులో శౌర్య గే గా న‌టిస్తున్నాడ‌ని తెలుస్తుంది. బ‌య‌టి సంస్థ‌ల్లో చేసి అది క‌రెక్ట్ గా ప్ర‌మోట్ చేయ‌లేక అన‌వ‌స‌రంగా ఫ్లాపులు తెచ్చుకోవ‌డం కంటే మ‌నమే సొంతంగా ఓ సంస్థ నిర్మించుకుంటే స‌రిపోతుంది క‌దా.. అంటున్నాడు శౌర్య‌. మరి ఛ‌లోతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న శౌర్య‌.. న‌ర్త‌న‌శాల‌తో మ‌రో ఛ‌లో లాంటి విజ‌యం అందుకుంటాడా..? 

More Related Stories