English   

చేజేతులా చేసుకున్న నాగ‌శౌర్య‌..!

ఒక్క హిట్ కొట్ట‌డానికి ఇండ‌స్ట్రీలో ఎన్ని తిప్ప‌లు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో చేస్తే కానీ ఆ ఒక్క హిట్ రాదు. అలాంటిది కెరీర్ మొద‌లైన ఇన్నేళ్ల‌కు ఛ‌లోతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఈ కుర్రాడిదే. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో హిట్ ప‌డుంటే శౌర్య మార్కెట్ ఇంకా పెరిగేది. కానీ ప్లానింగ్ విష‌యంలో దెబ్బ తింటున్నాడు శౌర్య‌. చ‌లో త‌ర్వాత స‌రైన సినిమాలు చేయ‌డంలో పూర్తిగా మిస్ ఫైర్ అయ్యాడు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే ఈ కుర్ర హీరోకు రెండు ఫ్లాపులు వ‌చ్చేసాయి. ఛ‌లో త‌ర్వాత విడుద‌లైన క‌ణం పూర్తిగా సాయిప‌ల్ల‌వి సినిమా. కానీ ఈ ఫ్లాప్ భారం క‌చ్చితంగా శౌర్య కూడా మోయాల్సిందే.

ఒక్క హిట్ కొట్ట‌డానికి ఇండ‌స్ట్రీలో ఎన్ని తిప్ప‌లు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో చేస్తే కానీ ఆ ఒక్క హిట్ రాదు. అలాంటిది కెరీర్ మొద‌లైన ఇన్నేళ్ల‌కు ఛ‌లోతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు నాగ‌శౌర్య‌. ఈ ఏడాది తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ ఈ కుర్రాడిదే. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో హిట్ ప‌డుంటే శౌర్య మార్కెట్ ఇంకా పెరిగేది. కానీ ప్లానింగ్ విష‌యంలో దెబ్బ తింటున్నాడు శౌర్య‌. చ‌లో త‌ర్వాత స‌రైన సినిమాలు చేయ‌డంలో పూర్తిగా మిస్ ఫైర్ అయ్యాడు నాగ‌శౌర్య‌. ఇప్ప‌టికే ఈ కుర్ర హీరోకు రెండు ఫ్లాపులు వ‌చ్చేసాయి. ఛ‌లో త‌ర్వాత విడుద‌లైన క‌ణం పూర్తిగా సాయిప‌ల్ల‌వి సినిమా. కానీ ఈ ఫ్లాప్ భారం క‌చ్చితంగా శౌర్య కూడా మోయాల్సిందే. ఇక మొన్నొచ్చిన అమ్మ‌మ్మ‌గారిల్లు కూడా ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో తెలియ‌దు. ఈ సినిమా కూడా నాగ‌శౌర్య ఇమేజ్ బాగా దెబ్బ‌తీసింది. ఛ‌లో త‌ర్వాత ఇంకో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డితే శౌర్య మార్కెట్ 15 కోట్ల వ‌ర‌కు పెరిగేది. కానీ స‌రైన ప్లానింగ్ లేక చేజేతులా కెరీర్ ను పాడు చేసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ప్ర‌స్తుతం సొంత బ్యాన‌ర్ లోనే న‌ర్త‌న‌శాల చేస్తున్నాడు శౌర్య‌. మ‌రి ఈ చిత్రంతో అయినా ఈ కుర్ర హీరో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడో లేదో చూడాలిక‌..!

More Related Stories