English   

నాగశౌర్య పార్టీ బ్యూటీస్ వెంటపడుతున్నాడే..

naga shourya

హీరోగా ఎన్నో ప్రయత్నాల తర్వాత ఛలోతో సోలోగా హిట్ అందుకున్నాడు నాగశౌర్య. దీనికి నిర్మాత కూడా తనే కావడంతో డబుల్ హ్యాపీస్ అయిపోయాడు. చిన్న సినిమాగా వచ్చిన ఛలో చాలా పెద్ద విజయమే సాధించింది. అయితే ఈ సినిమాలో శౌర్యతో పాటు మరో ఎస్పెట్ హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ నుంచి వచ్చిన ఈ సోయగం ఫస్ట్ మూవీకే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పేసుకుంది. 2016లో కన్నడలో వచ్చిన కిరిక్ పార్టీతో తెరంగేట్రం చేసిన ఈ భామకు తర్వాత ఆఫర్స్ వెల్లువెత్తాయి. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ బ్యూటీకి ఫిదా అయిపోయారు. అలాంటి కిరిక్ పార్టీ బ్యూటీతో రొమాన్స్ చేసిన నాగశౌర్య.. ఇప్పుడు మరో కిరాక్ బ్యూటీని పట్టేశాడు.

నాగశౌర్య లేటెస్ట్ మూవీ @నర్తనశాల. ఆనాటి నర్తన శాల ఓ క్లాసిక్. అలాంటి టైటిల్ తో సినిమా అంటే కాస్త ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతోనే కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి చెప్పిన కథకు ఓకే చెప్పాడు శౌర్య. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరో తెలుసా..? తెలుగు కిరాక్ పార్టీలో నటించిన బ్యూటీ సిమ్రన్ పరీంజా. యస్.. ఛలోలో ఒరిజినల్ కిరిక్ పార్టీ బ్యూటీతో రొమాన్స్... ఇప్పుడు నర్తన శాలలో రీమేక్ కిరాక్ బ్యూటీతో రొమాన్స్ అన్నమాట. అయితే ఇలాంటి కొత్త బ్యూటీస్ ను తీసుకోవడం వల్ల కాంబినేషన్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. పైగా రెమ్యూనరేషన్ కూడా తక్కువే. ఎలాగూ ఓ సినిమా చేసింది కాబట్టి.. ఆడియన్స్ కూ పరిచయమై ఉంటుంది. ఇన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టే సిమ్రన్ ను నర్తనశాలలోకి తీసుకువచ్చాడు శౌర్య.

More Related Stories