English   

 మీడియాను నిల‌దీసిన నాగ‌బాబు.. 

Nagababu-srireddy
2018-04-18 16:10:11

ఇప్పుడు అంతా ఇదే మాట్లాడుతున్నారు. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే మీడియా చూపిస్తుంది కానీ మీడియానే త‌ప్పు చేస్తే ఎవ‌రు చూపిస్తారు..? ఇప్పుడు నాగ‌బాబు కూడా ఇదే అడిగాడు. మీడియా అన్న‌పుడు న్యూస్ ను న్యూస్ గా చూపించాలి కానీ న్యూసెన్స్ లా కాదు. ప్రపంచంలో ఎన్నో విష‌యాలు ఉంటే ఈ రోజు కేవ‌లం శ్రీ‌రెడ్డి ఇష్యూనే ఎందుకు అంత‌గా హైలైట్ చేస్తున్నారంటూ మండిప‌డ్డాడు మెగా బ్ర‌ద‌ర్. ఈయ‌న అడిగిన దాంట్లోనూ న్యాయం ఉంది. మీడియా త‌లుచుకుంటే ఓ మంచోన్ని చెడ్డోన్ని చేస్తుంది.. ఈ నీచున్ని నీతిమంతుడిగా మారుస్తుంది.. ద‌య‌చేసి నిజాలు మాత్ర‌మే చూపించి ప్ర‌జ‌ల‌కు మంచి చేయండి అంటూ కోరాడు నాగ‌బాబు. గంట‌లు గంట‌లు డిబేట్లు పెట్టి మీ టిఆర్పీల కోసం ప‌క్కోడి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోకి రావ‌డం క‌రెక్ట్ కాద‌ని హెచ్చ‌రించాడు నాగ‌బాబు. ఆయ‌న ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న కో ఆర్డినేష‌న్.. క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు. ఇవి రాత్రికి రాత్రే తీసే వ్య‌వ‌హారాలు కావ‌ని.. దీనిపై చ‌ర్చ న‌డుస్తుంద‌ని.. త్వ‌ర‌లోనే ఓ ప‌రిష్కారం వ‌స్తుంద‌ని తెలిపారు. ఇక ప్ర‌తీ ఒక్క‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను మ‌ధ్య‌లోకి తీసుకు రావ‌డం ఫ్యాష‌న్ అయిపోయింద‌ని చెప్పాడు నాగ‌బాబు. తాము సాఫ్ట్ టార్గెట్స్ కాబ‌ట్టే త‌మ కుటుంబాన్ని అంటున్నార‌ని.. కానీ అది స‌హ‌నం మాత్ర‌మే అని చేత‌గానిత‌నం మాత్రం అనుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రించాడు నాగ‌బాబు. మొత్తానికి అటు శ్రీ‌రెడ్డి ఇష్యూతో పాటు ఇటు మీడియాకు కూడా చుర‌క‌లంటించాడు మెగా బ్ర‌ద‌ర్. మ‌రి ఈయ‌న ఆవేద‌న అస‌లు అర్థం అవుతుందో లేదో..? 

More Related Stories