English   

నాగబాబుది అంతా ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే

nag
2019-12-13 20:16:37

ఈ మధ్యలో జబర్దస్త్ ప్రోగ్రాంలో చాలా మార్పులు జరిగాయి. ఈ షో అనగానే గుర్తొచ్చే నాగబాబు ఈ షోని వదిలిపెట్టాడు. వచ్చే వాడు రాకుండా బయటికొస్తూ వీడియోలు చేసి మరీ ఆ షో నిర్వాహకుల మీద పెద్ద  పెద్ద బండలే వేశారు. ఒక్కటి కాదు అంతా ఆరిపోయిన సమయంలో ఆడుకున్నారని కూడా లేకుండా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారే నాయకుడిలా నాగబాబు పెద్ద పెద్ద బండలు వేశారు. అయితే ఆ షో పేరు చెప్పగానే గుర్తొచ్చే జబర్దస్త్ కి పెద్ద ఆయన బైటకు రావడంతో ఆ కార్యక్రమం రేటింగ్ సడన్ గా పడిపోతుందని, నాగబాబు లేని జబర్దస్త్ షోకి పెద్దగా అంత ఊపు ఉండదని విశ్లేషణలు వినిపించాయి. అయితే అదంతా విస్లేషణ మాత్రమే అని తేలిపోయింది. మూడు వారాలుగా నాగబాబు లేని జబర్దస్త్ షోని ప్రేక్షకులు ఏమాత్రం తగ్గనియ్యలేదు. తాజాగా వచ్చిన టీఆర్పీల్లో కూడా జబర్దస్త్ దే పై చేయి.  నాగబాబు లేకపోవడంతో షో మీద మరింత శ్రద్ద పెట్టిన నిర్వాహకులు. కొత్తగా గెస్ట్ రౌండ్ ని తీసుకొచ్చి ఆయా వారంలో సినిమాలు రిలీజ్ కి ఉన్న హీరోలను (సాయి తేజ్, కార్తికేయ) లంని తెచ్చి ఆడించారు. నాగబాబు లేకపోవడం వల్ల జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. సో నాగబాబు అతి ఊహలు అన్నీ గాల్లో మేడలు అంతే అన్నమాట.

 

More Related Stories