English   

ఇదేం న్యాయం నాగ‌బాబు గారు..? 

Naga-babu
2018-04-30 18:01:07

త‌న‌వ‌ర‌కు వ‌స్తే కానీ ఆ నొప్పి తెలియ‌దంటారు. మొన్న‌టి వ‌ర‌కు మీడియా ఇది.. అది అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు నోరు పారేసుకున్నాడు మెగా బ్ర‌ద‌ర్ నాగ బాబు. అది కూడా అన్ని మీడియా సంస్థ‌లు కాదు కానీ రెండింటిని మాత్రం బాగానే ఏకిపారేసాడు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మీరు ఏది ప‌డితే అది ప్ర‌సారం చేస్తే చూస్తూ ఊరుకోం అంటూ హెచ్చరించాడు కూడా. ఈయ‌న కోపం చూసి టివి 9తో మెగా హీరోల‌కు పూర్తిగా బంధం తెగిపోయింద‌నే అనుకున్నారంతా. కానీ అదేం విచిత్ర‌మో కానీ నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక మ‌ళ్లీ టీవీ 9లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అది చూసి అభిమానుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేంటి.. నిన్న‌టి వ‌ర‌కు తిట్టుకున్న ఛానెల్ లోనే మ‌ళ్లీ లైవ్ వ‌స్తుందేంటి అనుకున్నారంతా. కానీ అస‌లు విష‌యం త‌ర్వాత తెలిసింది. సినిమా కోసం నిర్మాత‌లే టీవీ 9తో రాజీకి వ‌చ్చారు. కాంప్రమైజ్ అయిపోయి లైవ్ కు స‌రే అనేసారు. విడుద‌ల‌కు ముందు మీడియాతో అన‌వ‌స‌రంగా ఎందుకు ర‌చ్చ అని వెన‌క్కి త‌గ్గాడు నాగ‌బాబు కూడా. ఎందుకంటే నా పేరు సూర్య‌కు ఆయ‌న కూడా ఓ నిర్మాతే క‌దా..! మొత్తానికి ఏదేమైనా మొన్న‌టి వ‌ర‌కు తిట్టి ఇలా వెంట‌నే క‌లిసిపోవ‌డం అనేది అభిమానుల‌కు మింగుడుప‌డ‌ని విష‌యం. మ‌రి ఈ రాజ‌కీయం ఏంటో వాళ్ల‌కే తెలియాలిక‌..!
 

More Related Stories