English   

 కత్తి మహేష్ కు నాగబాబు సీరియస్ వార్నింగ్..?

nagababu

ఈ మధ్య కాలంలో కత్తి మహేష్ అనే పేరు ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. కొందరికి అతను చేసే కమెంట్స్ నెగెటివ్ గా కనిపిస్తే మరో వర్గానికి పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత పొలిటికల్ గా కాస్త యాక్టివ్ అయిన కత్తి సడెన్ గా ఓ మతంపై చేసిన కమెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా కొత్త వ్యాజ్యానికి ఆజ్యం పోశాయి. ‘రాముడు ఓ నవలలోని పాత్ర మాత్రమే. అతనేమీ దేవుడు కాదు. అసలు సీత రావణుడి వద్దే ఉండి ఉంటే సేఫ్ గా ఉండేది. రాముడు తన వద్దకుతీసుకు వచ్చి అడవుల పాలు చేశాడు. ఈ విషయంలో రాముడు నా దృష్టిలో ఓ దగుల్బాజీ’.. ఇవీ కత్తి మహేష్ చేసిన కమెంట్స్.. దీంతో రెండు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు కత్తి మహేష్ పై మండిపడ్డాయి.

అతనిపై చాలామంది కేసులు పెట్టారు. దీంతో రీసెంట్ గా హైదరాబాద్ పోలీస్ లు కత్తి మహేష్ ను విచారించారు. ఇదిలా ఉండగా లేటెస్ట్ గా నటుడు, నిర్మాత నాగబాబు కత్తి వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. అతని పేరు కూడా ఉచ్ఛరించలేను అంటూ ఒకరకమైన భావంతో మాట్లాడాడు. అలాగే ప్రభుత్వాలు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టివిల్లో కానీ పబ్లిక్ ప్లేస్ లో కానీ మతపరమైన డిబేట్స్ పెట్టకుండా ఓ కొత్త చట్టం తేవాలని సరికొత్త పాయింట్ లేవనెత్తాడు. మొత్తంగా రాముడు మాకు దేవుడు, సీతమ్మ మాకు దేవత.. ఇన్నాళ్లూ ‘వ్యక్తులను’విమర్శిస్తే ఊరుకున్నాం.. కానీ మా దేవుళ్లను అంటే అంతుచూస్తాం అనే రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అయితే మామూలుగానే నాగబాబుకు హిందూ సంఘాల నుంచి విపరీతమైన ప్రచారం వస్తోంది. మరి ఈ వ్యాఖ్యలపై కత్తి మహేష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. 

More Related Stories