English   

నాగబాబు మరో ట్వీట్.. ఈసారి వైఎస్ జగన్‌కు..

jagan
2020-05-27 08:18:00

నాగబాబు ట్వీట్ చేస్తున్నాడంటూ చాలా వివాదాలు చెలరేగుతున్నాయి. ఆయన చేస్తున్న ట్వీట్స్ కూడా అలాగే ఉంటున్నాయి మరి. ఇప్పుడు కూడా ఆయన ఓ ట్వీట్ చేసాడు. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకం విషయం చాలా ట్రెండ్ అవుతుంది. దీనిపై చాలా మంది ఇప్పటికే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిపారు కూడా. అందులో సినిమా వాళ్లు కూడా ఉన్నారు. మంచు మనోజ్ లాంటి వాళ్లైతే కాస్త గట్టిగానే ప్రశ్నించారు కూడా. ఈ ఆస్తులను దేవుడు అమ్మమని చెప్పాడా అంటూ ప్రశ్నించాడు మనోజ్. ఇప్పుడు నాగబాబు కూడా తనవంతుగా ముందుకొచ్చాడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేయాలని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీనటుడు, జనసేన నేత నాగబాబు స్పందించాడు.

టీటీడీ భూముల విక్రయాన్ని నిలివేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలిపాడు ఈయన. ఈ మేరకు ట్వీటర్‌లో ఓ పోస్ట్‌ చేశారు. 'టీటీడీ భూముల అమ్మకాన్ని నిలిపివేసిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి గారికి అభినందనలు. అలాగే పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్విరీ చేసి నిజాలను నిగ్గు తేల్చండి. థాంక్యూ యు సీఎం గారు' అని ట్వీట్‌ చేశాడు నాగబాబు. ఈయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొన్నటికి మొన్న గాంధీని టార్గెట్ చేసి ఈయన చేసిన ట్వీట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి.

More Related Stories