English   

అనుష్కను వదలనంటోన్న నాగార్జున

nagarjuna and anushka

అనుష్క, నాగార్జునల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరికీ తెలుసు. ఒకరకంగా కొన్నాళ్ల క్రితం నాగ్ ను తన మెంటార్ గా ఫీలైంది అనుష్క. నాగ్ సూపర్ మూవీతోనే పరిచయమైన స్వీటీ ఆ తర్వాత నాగ్ క్యాంప్ లో చాలా సినిమాలే చేసింది. అతని కోసం కేమియోలు చేయడానికీ వెనకాడలేదు. అలాంటి బంధం ఇద్దరిదీ. తనకు స్క్రీన్ లైఫ్ ఇచ్చిన ఈ సోగ్గాడంటే ఈ చిన్నదానికి అంత ఇది. కానీ కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ కలిసినట్టు ఎక్కడా వార్తలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నాగార్జున అనుష్కను వదల్లేదు అనేలా కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వదలడం లేదు అంటే మరీ నానార్థాలూ తీయక్కర్లేదు. ఎందుకంటే అనుష్కను మరోసారి తన సినిమాలో తీసుకోబోతున్నాడు నాగార్జున. ఇవే ఆ వదలకపోవడం వెనక వార్తలు.

ప్రస్తుతం నాగార్జున రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పవర్ ఫుల్ కాప్ గా కనిపిస్తాడీ మూవీలో. కానీ నాగ్ కు హీరోయిన్ లాంటి పెయిర్ అంటూ ఏమీ ఉండదు. పాటలూ ఉండవు. అంటే రొమాన్స్ కు స్కోపే లేదన్నమాట. ఆ తర్వాత నానితో మల్టీస్టారర్ కు సిద్ధమవుతున్నాడు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేయబోతోన్న ఈ మూవీలో నాగ్ కు జోడీగా నటించేందుకు మరోసారి అనుష్క ఒప్పుకుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అంటే ఈ మల్టీస్టారర్ లో అనుష్క కూడా ఉంటుందన్నమాట. అప్పుడు నిజంగానే ఇదో పెద్ద మల్టీస్టారర్ గా మారుతుంది. అయితే అనుష్క పాత్ర రెగ్యులర్ హీరోయిన్ లా ఉండదని టాక్. పాత్ర నిడివి కూడా తక్కువగానే ఉంటుందని సమాచారం. అది కూడా నాగ్ కు జోడీగానే ఉంటుందని చెబుతున్నారు. నాగ్ తో కాబట్టే తను ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుని ఉండొచ్చు అనే రూమర్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా.. ఈ భాగమతి నిజంగానే ఈ మల్టీస్టారర్ లో భాగమైతే.. నాగార్జున అంటే అనుష్కకు ఎంత గౌరవమో మరోసారి ప్రూవ్ అవుతుంది.

More Related Stories