English   

హాట్ పెయిర్ మళ్ళీ కలిసి నటిస్తారా..?

Nagarjuna Anushka Shetty Hot Pair Will Repeat Again For Soggade Chinni Nayana Sequel
2018-09-23 08:55:05

నాగార్జున -అనుష్క‌.. ఈ జోడీకి టాలీవుడ్ లో సూప‌ర్ క్రేజ్ ఉంది. వీళ్ల పెయిర్ చూడ‌గానే సూప‌ర్ అంటారు ప్రేక్ష‌కులు కూడా. చిత్రంగా ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదీ లేదు కానీ నాగార్జున‌, అనుష్క క‌లిసి న‌టిస్తేనే అదో తెలియ‌ని మ‌జా ప్రేక్ష‌కుల‌కు. స్క్రీన్ పై వీళ్ల కెమిస్ట్రీ అలా ఉంది మ‌రి. అస‌లు అనుష్క‌ను ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చిందే నాగార్జున‌. సూప‌ర్ సినిమాతో ఈమెను తెలుగుతెర‌కు ప‌రిచ‌యం చేసాడు. త‌ర్వాత డాన్, ఢ‌మరుకం లాంటి సినిమాల్లో క‌లిసి న‌టించారు. చేసింది త‌క్కువ‌ సినిమాలే అయినా నాగ్, అనుష్క‌ మ‌ధ్య రిలేష‌న్ కూడా బాగానే పెరిగిపోయింది. ఈ జోడీకి తెలియ‌కుండానే బాగా క్రేజ్ వ‌చ్చేసింది.

అప్ప‌ట్లో వీళ్ళ‌పై వ‌చ్చిన కొన్ని రూమ‌ర్లు కూడా ఈ జోడీకి క్రేజ్ పెర‌గ‌డానికి హెల్ప్ అయ్యాయి. పైగా అక్కినేని వారింటికి అనుష్క ఎప్పుడూ అనుకోని అతిథే. అమల కూడా త‌న‌కు మంచి స్నేహితురాలంటోంది ఈ ముద్దుగుమ్మ‌. కొన్నేళ్ల నుంచి నాగార్జున‌ తో అనుష్క న‌టించ‌లేదు. ఇన్నాళ్ల‌కు క‌ళ్యాణ్ కృష్ణ‌ ఈ కాంబినేష‌న్ క‌లిపే ఏర్పాటు చేస్తున్నాడు. ఈయ‌న‌తో నాగార్జున చేయ‌బోయే బంగార్రాజు సినిమాలో అనుష్క‌నే హీరోయిన్ గా తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాకు సీక్వెల్ ఇది. సోగ్గాడే చిన్నినాయ‌నాలో కూడా అనుష్క గెస్ట్ రోల్ చేసింది. అన్నీ కుదిర్తే ఇదే ఏడాది సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఇందులో అనుష్క పాత్ర కీల‌కం అని తెలుస్తోంది. మ‌రి చూడాలి.. ఈ జోడీ తెర‌పై ఎలాంటి మ్యాజిక్ చేయ‌బోతున్నారో..?

More Related Stories