English   

నాగార్జున- చైతూ .. ఫైట్ మిస్

nag-chaitanya
2018-03-04 15:51:03

డేట్ క్లాష్ అనేది ఇండస్ట్రీలో కామన్. ఎవరు ముందు ప్రకటించారు అనేది పక్కనబెడితే ఇద్దరూ ఒకే డేట్ లో వస్తే అది బాక్సాఫీస్ వార్ గా మారుతుంది. ఈ మధ్య ఈ వార్ లోకి నాగార్జున, నాగచైతన్య కూడా చేరారు. దీంతో తండ్రీకొడుకుల యుద్ధం తప్పదనుకున్నారు చాలామంది. అందుకు కారణం మే25. ఈ డేట్ లో నాగచైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సవ్యసాచిని విడుదల చేయాలనుకున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో నిన్నటి లవర్ బాయ్ మాధవన్ విలన్ గా నటిస్తున్నాడు. మొదలైన దగ్గర్నుంచీ సవ్యసాచిపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని అందుకోవడానికి దర్శకుడు చందు మొండేటి పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. ఇప్పటికే చైతూతో అతను ప్రేమమ్ చేసి ఉన్నాడు. కాబట్టి వీరి కెమిస్ట్రీ కూడా సింక్ అయి ఉంటుంది. మొత్తంగాకొన్నాళ్ల క్రితం మే 25న సవ్యసాచి విడుదల చేస్తారని చెప్పారు. కానీ అదే డేట్ లో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినిమానూ ప్రకటిచారు. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఫైట్ తప్పదు అనుకున్నారు. కానీ ఈ క్లాష్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. 

రామ్ గోపాల్ వర్మ, నాగార్జున కాంబినేషన్ లో ఎన్నో యేళ్ల తర్వాత వస్తోన్న సినిమా ఆఫీసర్. హాలీవుడ్ మూవీ టేకెన్ ను పోలిన కథ అంటున్నారు. అయితే వీరికి నాగచైతన్య సినిమా రిలీజ్ డేట్ తెలుసో లేదో కానీ.. మొన్న మోషన్ పోస్టర్ విత్ టైటిల్ రిలీజ్ చేసినప్పుడు డేట్ కూడా అనౌన్స్ చేశారు. మే25 విడుదల అని. దీంతో ఎందుకొచ్చిన క్లాష్ అని చైతూ మూవీ టీమ్ లేటెస్ట్ గా తమ డేట్ ను సవరించుకుంది. సవ్యసాచి మే నుంచి జూన్ కు వెళ్లిపోయాడు. ఈ మేరకు ఓ అఫీషియల్ ప్రెస్ మీట్ కూడా అనౌన్స్ చేసి తండ్రీకొడుకుల వార్ అంటూ వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. మొత్తంగా నాగచైతన్య జూన్ 14న సవ్యసాచిగా రాబోతున్నాడు. కానీ ఆ టైమ్ కు అన్ని స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతుంటాయి. మరి ఈ డేట్ కరెక్టేనా అనేది రిజల్ట్ చూస్తే కానీ తెలియదు.

More Related Stories