English   

ప్ర‌ణ‌య్ అమృత‌కు చైతూ స్యామ్ తో లింక్.. 

Nagarjuna
2018-10-11 16:18:50

ఎక్క‌డ ప్ర‌ణ‌య్ అమృత.. ఎక్క‌డ చైస్యామ్.. అస‌లు వీళ్ళ జోడీల‌ను ఎవ‌రు పోల్చారు అనుకుంటున్నారా..? ఇంకెవ‌రు నాగార్జునే పోల్చాడు. కాస్త ఆల‌స్యంగా ప్ర‌ణయ్ హ‌త్య‌పై మాట్లాడాడు నాగార్జున‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేస్ పై ఇప్పుడు మ‌న‌సు విప్పి మాట‌లు చెప్పాడు ఈ హీరో. ముఖ్యంగా ప‌రువు హ‌త్య‌ను ఖండించాడు నాగార్జున‌. ఈ త‌రం పిల్ల‌లు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. వాళ్లు ఎవ‌రితో బ‌త‌కాలో కూడా వాళ్లే నిర్ణ‌యించుకుంటున్నారని చెప్పాడు నాగార్జున‌.  అందుకే వాళ్ళు త‌ప్ప‌ట‌డుగు వేయ‌నంత వ‌ర‌కు పిల్ల‌ల ఇష్టానికి గౌర‌వం ఇవ్వ‌డం మంచిదే అంటున్నాడు నాగార్జున‌. అయితే వాళ్ల వెంట ఎప్పుడూ ఓ కంట క‌నిపెడుతూనే ఉండాల‌ని.. వాళ్లు త‌ప్పు చేస్తున్నార‌ని తెలిస్తే మందలించ‌డంలో త‌ప్పు లేదు కానీ పిల్ల‌లు ఇష్ట‌ప‌డింది ఇవ్వ‌డం.. వాళ్ల ఇష్టాన్ని గౌర‌వించ‌డం మాత్రం పెద్ద‌లుగా మ‌న బాద్య‌త అంటున్నాడు మ‌న్మ‌థుడు. 

అయినా చిన్నప్పుడు పిల్లలకు నచ్చిన బొమ్మలు కొనిచ్చే వాళ్లు.. ఆ త‌ర్వాత ప్రేమ విష‌యంలో మాత్రం రివ‌ర్స్ అవుతుంటామ‌ని చెప్పాడు నాగ్. కానీ ఆ రివ‌ర్స్ అవ‌డంలో కూడా పేరెంట్స్ ప్రేమ ఉంటుంద‌ని.. అయితే ఒక్కోసారి పిల్ల‌లు కూడా రైట్ ప‌ర్సన్ ను జీవిత భాగ‌స్వామిగా ఎంచుకుంటారు అని అలాంట‌ప్పుడు వాళ్ల‌కు గౌర‌వం ఇవ్వ‌డంలోనే పెద్ద‌రికం ఉంటుంద‌ని చెప్పాడు నాగార్జున‌. తాను చైతూ స్యామ్ విష‌యంలో ఇదే చేసాన‌ని చెప్పాడు నాగార్జున‌. నిజంగానే స‌మంత చాలా మంచి అమ్మాయి.. వాళ్లిద్ద‌రూ ఒక‌ర్నొక‌రు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే పెళ్లి చేసుకున్నారంటూ ఇటు ప్ర‌ణ‌య్ అమృత‌ను అక్క‌డ చైస్యామ్ ను క‌లిపి చెప్పాడు నాగార్జున‌. 

More Related Stories