English   

నాగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..!

nagarjuna confuse about next projects
2018-06-04 06:30:00

వ‌ర్మ ఇప్పుడు మారిపోయాడు.. శివ త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్ క‌థ చెప్పాడు.. చెప్పిన‌ట్లు తీయ‌క‌పోతే త‌న్న‌మ‌న్నాడు.. ఇలా ఆఫీస‌ర్ విడుద‌ల‌కు ముందు ఏదేదో చెప్పాడు నాగార్జున‌. ఇప్పుడు అనుభ‌విస్తున్నాడు. ఈ చిత్రంతో హ్యాట్రిక్ ఫ్లాపులు పూర్తి చేసాడు ఈ హీరో. ఓం న‌మో వెంక‌టేశాయా సినిమాతో మొద‌లైన ఫ్లాపుల ప‌రంప‌ర‌.. ఇప్ప‌టికీ సాగుతూనే ఉంది. రాజుగారిగ‌ది 2.. ఇప్పుడు ఆఫీస‌ర్ తో డిజాస్ట‌ర్ల మీద డిజాస్ట‌ర్లు ఇస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ముఖ్యంగా ఆఫీస‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇప్పుడు నాగార్జున మ‌ళ్లీ మొద‌ట్నుంచీ మొద‌లు పెట్టాలేమో..? అంత‌గా దిగ‌జారిపోయింది ఈయ‌న ఇమేజ్.. దానికితోడు మార్కెట్ ఇప్పుడు. నానితో ప్ర‌స్తుతం మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు నాగార్జున‌. ఈ చిత్రం త‌ర్వాత మూడు సినిమాలు క‌మిట‌య్యాడు ఈ హీరో. ఇప్ప‌టికే మోహ‌న్ లాల్ హీరోగా తెర‌కెక్కుతోన్న ఓ మ‌ళ‌యాల సినిమాలో న‌టించ‌డానికి సై అన్నాడు నాగ్. ఈ చిత్రంతో పాటు ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌బోతున్నాడు నాగార్జున‌. ర‌జినీ కోసం రాసుకున్న క‌థ‌లోకి ఇప్పుడు నాగ్ వ‌చ్చాడు. ఇక బంగార్రాజు కూడా లైన్ లోనే ఉన్నాడు. అయితే క‌ళ్యాణ్ కృష్ణ‌కు నేల‌టికెట్ లాంటి డిజాస్ట‌ర్ రావ‌డంతో నాగార్జున ఇప్పుడు ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. మ‌రి చూడాలిక‌.. ప‌డిపోయిన మార్కెట్ ను మ‌ళ్లీ పైకి ఎలా తెచ్చుకుంటాడో ఈ హీరో..? 

More Related Stories