English   

దేవదాస్ బాటిల్ ఓపెన్ చేయబోతున్నాడు

Nagarjuna-Devadas
2018-08-05 14:44:51

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార నాని కలిసి నటిస్తోన్న సినిమా దేవదాస్. చేసిన రెండు సినిమాలతో డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో వచ్చిన కుర్రాడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకుడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విషయంలో కొంతైనా తెలియడానికి వీళ్లు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. యస్.. దేవదాస్ టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. అయితే దాన్ని కూడా వెరైటీ పోస్టర్ తో చెబుతూ.. ఓ బాటిల్ పెట్టారు. ఆ బాటిల్ ఓపెన్ చేసే డేట్ అంటూ ఇన్ డైరెక్ట్ గా టీజర్ మేటర్ చెబుతున్నారు. 

ఇక దేవదాస్ టీజర్ ను ఈ నెల 7న సాయంత్రం 4గంటలకు విడుదల చేయబోతున్నారు. మొత్తంగా ఈ మల్టీస్టారర్ లో నాని డాక్టర్ దేవ్ గా నాగార్జున డాన్ దేవ్ గా నటిస్తున్నారనే ప్రచారం ముందు నుంచీ జరుగుతోంది. ఇది ఓ హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్ స్పైర్ అయి రాసుకున్న కథ అని ఈ థీమ్ ను బట్టే చాలామంది చెప్పేశారు. మరి అదెంత నిజం అనేది టీజర్ లో కొంత వరకూ తెలియొచ్చు. మొత్తంగా నాగ్ సరసన ‘మళ్లీరావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తుండగా.. ప్రస్తుతం రైజింగ్ బ్యూటీగా చెబుతోన్న రష్మిక మందన్నా  నానితో రొమాన్స్ చేస్తోంది. మొత్తంగా ఈ నెల 7న విడుదల చేయబోతోన్న ఈ బాటిల్ ఘాటెంతో చూడాలి. 

More Related Stories