English   

సినీ వర్కర్స్ యూనియన్‌కు నాగార్జున కోటి విరాళం.. 

 Nagarjuna
2020-03-28 16:30:45

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది విరాళం అందించారు. ఇప్పుడు కరోనా కారణంగా పని లేకుండా పోయిన వర్కర్స్ అందరికీ కలిపి కోటి రూపాయలు అందించాడు నాగార్జున. సిఎం సహాయ నిధి కంటే కూడా సినిమా రోజువారి కూలీలకే తన మొత్తం సాయం అందించాడు నాగ్. ఇప్పటికే చాలా మంది నటులు, హీరోలు ముఖ్యమంత్రుల సహాయ నిధితో పాటు వర్కర్స్ యూనియన్ కు కూడా సాయం చేసారు. ఇప్పుడు నాగార్జున అయితే కాస్త ఆలస్యంగా స్పందించాడు. కానీ భారీ విరాళమే అందించాడు. అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ ఇవ్వలేదేంటి అనే ప్రశ్నలకు సమాధానంగా కోటి రూపాయాలు అందించాడు నాగార్జున అక్కినేని. తోటి నటీనటులు చేసిన సాయం చూసి తనకు కూడా ఆనందంగా అనిపించిందని చెప్పాడు ఈయన. ఇది సినిమా కోసం పని చేస్తున్న కార్మికులకు పనికొస్తే అంతకంటే ఆనందం మరోటి లేదంటూ ట్వీట్ చేసాడు నాగార్జున. 

More Related Stories