English   

బాలీవుడ్ లో నాగార్జున బ్రహ్మాస్త్రం..!!

nagarjuna
2018-07-10 16:09:16

సోగ్గాడే చిన్నినాయనాతో వచ్చిన బిగ్గెస్ట్ మార్కెట్ ను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు నాగార్జున. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. లేదా ఆకట్టుకునే కథలు ఎంచుకోలేదు. ఇక చివరిగా వచ్చిన ఆఫీసర్ ఆయన కెరీర్ లోనే కాదు.. మొత్తం టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా హయ్యొస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం నానితో కలిసి దేవదాస్ చేస్తోన్న నాగ్.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నాడు అని చెప్పలేం.. బట్.. ఎన్నాళ్లుగా ఎదురుచూస్తోన్న బాలీవుడ్ పై లేటెస్ట్ గా బ్రహ్మాస్త్రం విసరబోతున్నాడు నాగ్. యస్... నాగ్ మళ్లీ బాలీవుడ్ కు వెళ్లబోతున్నాడు.. 

నిజానికి చాలాకాలంగా బాలీవుడ్ రీ ఎంట్రీ కోసం చూస్తున్నాడు నాగ్. ఆ ఛాన్స్ అనుకోకుండా వచ్చిందిపుడు. హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ అండ్ భారీ తారాగణంతో రూపొందుతోన్న సినిమా బ్రహ్మాస్త్రం. ఈ మూవీలో నాగ్ ను తీసుకున్నారనే ప్రచారం నేషనల్ మీడియాలోనే జరుగుతుండటం విశేషం. రణ్ బీర్ కపూర్, అలియా భట్ జంటగా నటిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నాగ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడానికి అమితాబ్ కూడా ఉండటమే కారణం అంటున్నారు. త్వరలోనే ముంబైలో స్టార్ట్ కాబోయే షెడ్యూల్ తో నాగ్ బ్రహ్మాస్త్రం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కాబోతున్నాడు.

ఇక గతంలో నాగ్ బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశాడు. ఖుదాగవా, క్రిమినల్, జక్మ్ తో పాటు 2003లో వచ్చిన ఎల్వోసీ కార్గిల్ సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత నాగ్ కు కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇక్కడ బిజీగా ఉండటంతో వెళ్లలేదు. కానీ గత కొన్నాళ్లుగా మళ్లీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక అనుకోకుండా 15యేళ్ల తర్వాత తీరబోతోందన్నమాట. 

More Related Stories