English   

నాగార్జున హైదరాబాద్ వచ్చేసాడోచ్.. బిగ్ బాస్ షూటింగ్‌తో మన్మథుడు బిజీ..

Nagarjuna
2020-10-30 20:44:45

వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మూడు వారాల పాటు మనాలీకి వెళ్లిపోయాడు నాగార్జున. దాంతో మూడు వారాల పాటు బిగ్ బాస్ ను నాగార్జున మిస్ అవుతాడని అభిమానులు కూడా అంతా ఫిక్సైపోయారు. అందుకే సమంతకు కూడా కోట్లకు కోట్లు ఇచ్చి బిగ్ బాస్ టీం తీసుకొచ్చింది. అయితే ఈమె ఫస్ట్ ఎపిసోడ్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మధ్యలోనే నాగార్జున మళ్లీ వచ్చేస్తున్నాడు. మనాలిలో వైల్డ్ డాగ్ షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి మరీ వస్తున్నాడు నాగార్జున. గతవారం మామ నుంచి కోడలు బాధ్యతలు తీసుకుంటే.. ఇప్పుడు మళ్లీ కోడలు నుంచి ఈ వారం తను ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నాడు నాగార్జున. తొలి ఎపిసోడ్‌లోనే సమంతకు మంచి అప్లాజ్ వచ్చినా కూడా కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. పైగా అది అక్కినేని ఫ్యామిలీ షో అంటూ సెటైర్లు కూడా వచ్చాయి. అందుకే రిస్క్ తీసుకోకుండా తన షోను మళ్లీ తాను తీసుకుంటున్నాడు నాగార్జున.

 కాస్త కష్టమైనా పర్లేదు కానీ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ వచ్చి వీకెండ్స్ షూటింగ్ చేసి మళ్లీ మనాలికి వెళ్ళనున్నాడు నాగార్జున. ఈయన కోసం ప్రత్యేకంగా ఓ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసింది బిగ్ బాస్ టీం. వైల్డ్ డాగ్ షూటింగ్ కు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి శుక్ర, శనివారాలు వచ్చి శని, ఆదివారాల ఎపిసోడ్స్ షూటింగ్ చేసి మళ్లీ వెళ్ళనున్నాడు మన్మథుడు. ముందు 21 రోజులు అక్కడే ఉండాలని అనుకున్నా కూడా ఎందుకో మనసు మార్చుకున్నాడు నాగార్జున. వైల్డ్ డాగ్‌కు వారానికి రెండు రోజులు బ్రేక్ ఇచ్చి బిగ్ బాస్ పని పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈయన. ఆ రెండు రోజులు తాను లేని సన్నివేశాలు చిత్రీకరించాలని దర్శకుడు సోల్మోన్ కు నాగార్జున సూచించినట్లు ప్రచారం జరుగుతుంది. అలా హైదరాబాద్ వచ్చి అనుకున్నది పూర్తి చేసి వెళ్తున్నాడు మన్మథుడు. ఏదేమైనా కూడా మూడు వారాల పాటు కనిపించడేమో అనుకున్న నాగార్జున.. సడన్ గా ప్రత్యక్షం అవుతుండటంతో పండగ చేసుకుంటున్నారు నాగార్జున ఫ్యాన్స్. 

More Related Stories