English   

నాగార్జున కొంప ముంచిన న‌మ్మ‌కం.. 

nagarjuna
2018-07-24 06:43:08

న‌మ్మ‌కం.. న‌మ్మ‌కం.. న‌మ్మ‌కమే లేకుంటే లేదేది అంటూ ఆ మ‌ధ్య ఓ ఛానెల్ లో సీరియ‌ల్ వ‌చ్చేది గుర్తుందా అంద‌రికీ. ఈ పాట బాగా ఫేమ‌స్ కూడా. ఇప్పుడు ఇలాంటి న‌మ్మ‌కం నాగార్జున‌తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్, ప్ర‌భు కొంప‌లు కూడా ముంచేస్తున్నాయి. ఇప్ప‌టికే అమితాబ్ బ‌చ్చ‌న్ కు ఈ షాక్ త‌ప్ప‌లేదు. క‌ళ్యాణ్ జ్యూవెల‌ర్స్ కోసం భారీగా ఓ యాడ్ షూట్ చేసారు. అందులో తాత‌, మ‌న‌వ‌రాళ్లు బ్యాంక్ కు వ‌స్తారు. త‌న‌కు ఒకే నెల‌లో రెండుసార్లు పెన్ష‌న్ వ‌చ్చింద‌ని.. అందుకే తిరిగి ఇవ్వ‌డానికి వ‌చ్చాన‌ని చెబుతాడు తాత‌. దానికి బ్యాంక్ ఉద్యోగులు కూడా పండ‌గ చేస్కోండి స‌ర్ ఎవ‌రు అడుగుతారు అంటూ చెప్తారు. దానికి నా మ‌న‌స్సాక్షికి తెలుసు.. అది మోసం.. న‌మ్మ‌కం ఉండాలి అంటూ డైలాగులు చెప్తాడు ఆ తాత‌. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ జువెల‌ర్స్ న‌మ్మ‌కం అంటూ యాడ్ ముగుస్తుంది. 

ఇదే ఇప్పుడు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌కు కోపం తెప్పిస్తుంది. ఈ ప్ర‌క‌ట‌న‌లో బ్యాంకింగ్ వ్యవస్థ గురించి త‌మ‌కు తోచిన‌ట్లు చూపించార‌ని.. ఇది చూసిన త‌ర్వాత ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకం పోతుందని బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఆరోపిస్తుంది. దీనిపై వెంట‌నే సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవాల‌ని వాళ్లు కోరుకుంటున్నారు. అయితే విష‌యం అంత దూరం వెళ్ల‌కముందే త‌న యాడ్ ను తొలగించేసారు క‌ళ్యాణ్ జూవెల‌ర్స్ సంస్థ‌. దానికితోడు ఎవ‌రి మ‌న‌సునైనా గాయ‌ప‌రిచి ఉంటే క్ష‌మించాలంటూ కోరింది కళ్యాణ్ జువెల్లర్స్ సంస్థ. ఇదే యాడ్ తెలుగు వ‌ర్ష‌న్ లో నాగార్జున‌.. త‌మిళ్ లో ప్ర‌భు న‌టించారు. ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న‌ట్లు ఇక్క‌డ ఒక్క‌దెబ్బ‌కు మూడు పిట్ట‌లు పడ్డాయి.

More Related Stories