English   

నాగార్జున వాళ్లను మిస్ అవుతున్నాడట

nagarjuna
2018-07-16 20:22:31

అక్కినేని నాగార్జున ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యాడు. తెలుగులో నానితో కలిసి దేవదాస్ చేస్తోన్న నాగ్ బాలీవుడ్ లో బ్రహ్మస్త్రం అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇది సినిమాలో ఓ కీలకమైన పాత్ర అంటున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీతో దాదాపు పదమూడేళ్ల తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టాడు నాగ్. మొత్తంగా నిన్నటి వరకూ ఇది నిజమా అనుకున్న వారిని ఆన్సర్ ఇస్తూ ఆ మూవీ ఆన్ లొకేషన్ లో ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేశాడు. 

రణ్ బీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. నాగార్జున కూడా ఈ సినిమాలో నటించాలనుకోవడానికి ఓ కారణం కూడా అమితాబ్ అంటున్నారు. అయితే ఈ సినిమాలోని పాత్ర తన పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ఉందని అందుకే ఒప్పుకున్నానని కూడా అంటున్నాడు నాగార్జున. మొత్తంగా అమలతో కలిసి ఆ టీమ్ తో దిగిన ఫోటోను యాడ్ చేస్తూ.. బ్రహ్మాస్త్రం టీమ్ ను మిస్ అవుతున్నా అంటూ ట్వీట్ చేశాడు. దీన్నిబట్టి తన బాలీవుడ్ రీ ఎంట్రీ గురించి కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు నాగ్.

More Related Stories