English   

నాగార్జున, నాని ఓ కన్నడ బ్యూటీ

nani and nagarjuna and shraddha srinath

తెలుగులో మల్టీస్టారర్స్ లేకుండా పోతున్నాయో అనుకుంటోన్న టైమ్ లో నాగార్జున మళ్లీ ఆ ట్రెండ్ కు కాంబినేషన్స్ ఊదుతున్నాడు. నానితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు నాగ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. భలేభలే మగాడివోయ్, శమంతకమణి ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కబోతోందీ నయా మల్టీస్టారర్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నాగ్.. రామ్ గోపాల్ వర్మ సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు నాని కూడా కృష్ణార్జున యుద్ధంతో పాటు తన సొంత మూవీ అఁ రిలీజ్ కు సంబంధించిన పనుల్లో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఇద్దరూ ఫ్రీ అవుతారు. అప్పుడుఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ఈ లోగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశాడు శ్రీరామ్ ఆదిత్య. మూవీలో నాగార్జున సరసన హీరోయిన్ ను ఫిక్స్ చేశాడు. కన్నడ సోయగం శ్రద్ధా శ్రీనాథ్ .. నాగ్ తో రొమాన్స్ కు ఒప్పుకుందట. 
శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ, తమిళ హిట్ మూవీస్ లో నటించింది. అయితే తన క్యారెక్టర్ సినిమా అంతా ఉండదట. మూవీలో ఓ పార్ట్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర ఉంటుందని టాక్. మొత్తంగా శ్రీరామ్ మంచి టాలెంటెడ్ బ్యూటీనే పట్టుకున్నాడు. మణిశర్మ సంగీతం అందించబోతోన్నఈ మూవీ ఈ నెలాఖరునే స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు. ఒక్కసారి స్టార్ట్ అయ్యాక బ్రేకుల్లేకుండా షూటింగ్ కూడా ఉంటుందట.

More Related Stories