English   

నాగ్ అండ్ నాని డేట్ ఫిక్స్ చేసుకున్నారు

Nani-nag

అక్కినేని నాగార్జున, నేచులర్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తోన్న మల్టీస్టారర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడే త్వరపడకపోతే పోటీ పెరుగుతుందనుకున్నారో ఏమో.. ఇంకా చాలా టైమ్ ఉండగానే డేట్ లాక్ చేసుకున్నారు. భలేమంచి రోజు, శమంతకమణి వంటి విభిన్నమైన సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీని అశ్వనీదత్ నిర్మిస్తుండటం విశేషం. చాలా రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. 

ఇక నాగార్జున సరసన మళ్లీ రావా ఫేమ్ ఆకాంక్ష సింగ్ నటిస్తోంటే.. నాని సరసన ఛలో ఫేమ్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ హీరోయిన్లు కూడా ఈ మూవీకి ఫ్రెష్ ఫీలింగ్ తెస్తారనే నమ్మకంతో ఉంది టీమ్. ఫస్ట్ టైమ్ ఆ భామలు ఈస్టార్స్ తో రొమాన్స్ చేయబోతుండటం కూడా అందుకు ఓ కారణం. మొత్తంగా మళ్లీ ఓ వైవిధ్యమైన కథతోనే వస్తున్నట్టు శ్రీరామ్ ఆదిత్య చెబుతున్నాడు. ఇక రిలీజ్ డేట్ పరంగా కూడా ఓ సెలబ్రేషన్ టైమ్ సెట్ చేసుకుందీ టీమ్. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది కూడా సినిమాకు ప్లస్ అయ్యే అంశమే. 

ఈ యేడాది వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 12న విడుదల చేయబోతున్నారీ సినిమాను. సినిమా ఏ మాత్రం బావున్నా ఆ తొమ్మిది రోజులు కలిసొస్తుంది. మరోవైపు ఇంత వరకూ వేరే ఏ సినిమా వాళ్లు కూడా ఆ డేట్ లో వస్తున్నట్టు చెప్పలేదు. వీరే ముందు అనౌన్స్ చేస్తున్నారు. సో.. పోటీ కూడా ఉండదనుకోవచ్చు. మరి టైమ్ ను ఈ టీమ్ ఎలా యూజ్ చేసుకుంటుందో చూడాలి.

More Related Stories