English   

నాగార్జున, నాని దేవ‌దాస్ లే ..!! 

devadas

అనుకున్న‌ట్టుగానే అయింది. ఊహించిందే జ‌రిగింది. అక్కినేని నాగార్జున‌, నాని కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ కు దేవ‌దాస్ అనే టైటిల్ నే క‌న్ఫార్మ్ చేశారు. నిజానికి ఇదే టైటిల్ పెట్ట‌బోతున్నారంటూ గ‌త కొన్నిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్నిసార్లు ఇవి పుకార్లుగా మిగిలిపోతాయి. బ‌ట్ ఈ సారి అలా కాలేదు. అంతా ఊహించిన‌ట్టుగానే నాగ్ అండ్ నానిల‌ను దేవ‌దాస్ లుగా తేల్చాడు ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌. అయితే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ మాత్రం కాస్త వెరైటీగా చేశాడు శ్రీరామ్. డాక్ట‌ర్లు రాసే ఓ ప్రిస్కిప్ష‌న్ పైన టైటిల్ రాశాడు.  ఆ ప్రిస్కిప్ష‌న్ చూస్తే శాంతాబాయ్ మెమోరియ‌ల్ ఛారిటీ హాస్పిటల్ పేరుపై ఉన్న ఓ లెట‌ర్ పాడ్ పై ఉందీ టైటిల్. ఈ ప్రిస్కిప్ష‌న్ పై పేరు, డేట్ కాల‌మ్స్ తో పాటు సీనియ‌ర్ సిటిజ‌నా కాదా అనే ఆప్సన‌ల్ కాల‌మ్ కూడా ఉంది.

మొత్తంగా ఇది ఆ హాస్పిట‌ల్ చుట్టూ తిరిగే క‌థ అని చెప్ప‌క‌నే చెప్పాడు ద‌ర్శ‌కుడు. అలాగే పోస్ట‌ర్ లో ఓ సిల్వ‌ర్ క‌ల‌ర్ తుపాకీతో పాటు రెండు బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఇవి చూస్తోంటే జెంటిల్మ‌న్ లాంటి క‌థ గుర్తొస్తే త‌ప్పు ఆడియ‌న్స్ ది మాత్రం కాదు. కాక‌పోతే శ్రీరామ్ క‌థ‌ల‌ను కొత్త‌గా చెబుతాడు. అందుకే నాని అండ్ నాగ్ ఒకే చెప్పి ఉంటార‌నుకోవ‌చ్చు.  ఇక ఫ‌స్ట్ టైమ్ కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న ఈ మూవీని వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నాడు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక హీరోయిన్లుగా నాని స‌ర‌స‌న ఛ‌లో బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా, నాగార్జున స‌ర‌స‌న మరో క‌న్న‌డ సోయ‌గం శ్ర‌ద్ధా శ్రీనాథ్ న‌టిస్తున్నారు.
 

More Related Stories