English   

నాని-నాగ్ సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

Nagarjuna-Nani

బాలీవుడ్ లో మాదిరి ఇక్క‌డ ఇంకా మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ రాలేదు. అక్క‌డ షారుక్ సినిమాలో స‌ల్మాన్ న‌టిస్తాడు.. స‌ల్మాన్ సినిమాలో అమీర్ చేస్తాడు. కానీ  మ‌న ద‌గ్గ‌ర అంత సినిమా లేదు. ఒక‌రి సినిమాలో మ‌రొక‌రు న‌టించ‌డం అంటే త‌క్కువ‌య్యామ‌నే ఫీలింగ్ లో ఉంటారు. కానీ ఇప్పుడిప్పుడే అది మారుతుంది. ఈ మ‌ధ్యే అజ్ఞాత‌వాసిలో వెంక‌టేశ్ అతిథిపాత్ర‌లో మెరిసాడు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ కూడా వ‌స్తుంది. వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్న నాని.. సీనియ‌ర్ హీరో నాగార్జున క‌లిసి ఓ సినిమాలో న‌టించ‌బోతున్నారు. సీనియ‌ర్ నిర్మాత అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. 

కొన్ని రోజుల కింది వ‌ర‌కు ఈ చిత్రంపై కాస్తో కూస్తో ఏదో మూల‌న అనుమానం ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఈ సినిమా మార్చ్ 18 నుంచి ప‌ట్టాలెక్క‌నుంది. ఈ విష‌యంపై నాగ్, నాని కూడా క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చారు. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. ఇందులో నాగార్జున మాఫియా డాన్ గా.. నాని డాక్ట‌ర్ గా న‌టించ‌బోతున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. త‌న‌కు నాని అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త‌న కామెడీ టైమింగ్ న‌చ్చుతుంద‌ని అందుకే క‌లిసి న‌టిస్తున్నాన‌ని చెప్పాడు నాగార్జున‌. ఈ చిత్రం కోసం తాను కూడా చాలా ఆస‌క్తిగా వేచి చూస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.

నాగార్జున‌. ఇక నాని కూడా నాగార్జున‌తో సినిమా చేయ‌డానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. ఆయ‌న న‌ట‌న త‌న‌కు న‌చ్చుతుం ద‌ని చెప్పాడు న్యాచ‌ర‌ల్ స్టార్. ఇద్ద‌రూ ఒక‌ర్నికరు బాగానే పొగుడుకుంటున్నారు. ఈ మ‌ధ్యే శమంత‌క‌మ‌ణిలో న‌లుగురు హీరోలను ఒకేచోట క‌లిపిన‌ శ్రీ‌రామ్.. ఇప్పుడు నాగార్జున‌-నాని కోసం క‌థ రాస్తున్నాడు. ఈయ‌న చెప్పిన లైన్ న‌చ్చి నాని కూడా ఓకే చెప్పాడు. మార్చ్ 18న ప‌ట్టాలెక్క‌బోయే ఈ చిత్రం ఇదే ఏడాది విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. నాని, నాగార్జున సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టించ‌బోతుందో..? 

More Related Stories