English   

రంగస్థలం సీక్వెల్ లో నాని..?

Nani
2018-04-19 13:39:29

ఏంటీ టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా. కొన్ని ఇన్సిడెంట్స్ అలాగే ఉంటాయి. ఆశ్చర్యపోయేలా. మరికొన్ని కథలు అలాగే ఉంటాయి.. సీక్వెల్స్ తీస్తున్నారా అనేలా. ఇప్పుడు నాని సినిమా కథపై కూడా ఇలాంటి రూమరే చక్కర్లు కొడుతోంది. నాని- నాగార్జున కాంబినేషణ్ లో శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ కథ ఇదేనంటూ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఆ న్యూస్ చూస్తే ఖచ్చితంగా ఇది రంగస్థలంకు సీక్వెలా అనిపించక మానదు. సీక్వెల్ అని ఎందుకనిపించిందంటే ఖచ్చితంగా రంగస్థలం ఎక్కడ ఎండ్ అయిందో.. ఈ ‘రూమర్ కథ’అక్కడి నుంచే స్టార్ట్ అవుతోంది కాబట్టి. ఇంతకీ ప్రస్తుతం టాలీవుడ్ లో హల్చల్ చేస్తోన్న ఆ కథేంటో తెలుసా..?

ఈ మల్టీస్టారర్ లో నాని డాక్టర్. అతను సీరియస్ కండీషన్ లో ఉన్న ఓ పేషెంట్ ను అతను చూసుకుంటుంటాడు. అఫ్ కోర్స్ చాలా వరకూ బాగు చేస్తాడు. అయితే ఆ పేషెంట్ కు సంబంధించిన వ్యక్తినంటూ నాగార్జున హాస్పిటల్ సీన్ లోకి ఎంటర్ అవుతాడు. నాగ్ అతన్ని బాగా చూసుకుంటాడు. ఈ క్రమంలో నాగ్, నాని మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ తీరా ఆ పేషెంట్ కోలుకున్నాక.. నాగార్జున అతన్ని చంపేస్తాడు. షాక్ అయ్యారా.. ఇదే ఇప్పుడు వినిపిస్తోన్న ఆ కథ. రంగస్థలంలో కూడా ప్రకాష్ రాజ్ కు బాగయ్యేంత వరకూ సేవలు చేసి చంపేస్తాడు కదా రామ్ చరణ్. ఇప్పుడా పని నాగార్జున చేస్తాడన్నమాట.

మరి ఇదెంత వరకూ నిజమో కానీ.. నాని డాక్టర్ అనేది మాత్రం నిజం. అందుకోసం సారథి స్టూడియోలో ఓ హాస్పిటల్ సెట్ కూడా వేస్తున్నారు. సినిమా చాలా భాగం ఈ సెట్ లోనే షూటింగ్ జరుపుకుంటుందట. సో.. మరి కథ ఇదే అయితే మాత్రం కొంత ఇబ్బందులు తప్పవు. కానీ యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ మరీ అంత బ్లైండ్ గా వెళతాడనుకోలేం. కుర్రాడు తీసిన రెండు సినిమాలు చూస్తే అతన్లో విషయం ఉన్నట్టు తెలుస్తుంది. పైగా నాగార్జున, నాని అంత ఈజీగా ఏ కథనూ యాక్సెప్ట్ చేయరు. సో.. పాయింట్ అదే అయినా.. దానిచుట్టూ కథనం ఖచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందేమో..

More Related Stories