English   

నాగార్జున గారూ.. మీరైనా చెప్పండి సార్..?

officer

ఆఫీసర్ టీజర్ చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అసలు ఫస్ట్ లుక్ నుంచే పిచ్చెక్కించి... టీజర్స్ తో భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న టైమ్ ఇది. అలాంటిది ఇప్పటి వరకూ ఒక్క అంశం కూడా ఆకట్టుకునేలా లేకుండా వస్తున్నాడు ఆఫీసర్. ఆఖరికి ఇవాళ విడుదలైన టీజర్ సైతం పెద్దగా కిక్ ఇవ్వలేదు. అసలు నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సినిమా అంటే ఓరేంజ్ లో ఉంటుందేమో అనుకున్నవారి ఆశలపై ఈ ఆఫీసర్ టీజర్ తో నీళ్లు చల్లాడు. చాలా సాధారణంగా మొదలైన టీజర్ లోనే కథంతా చెప్పాడు వర్మ. ఓ పోలీస్ ఆఫీసర్ ను చంపిన కేస్ ను ఇన్వెస్టిగేట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా హైదరాబాద్ నుంచి ముంబైకి రిక్రూట్ అయ్యే ఆఫీసరే నాగార్జున. అతను బలవంతమైన విలన్ ను ఎదుర్కొని హత్య కేస్ ను ఛేదించడం.. ఇదే కథ. ఇలాంటివి ఇప్పటికే ఎన్నో చూశాం. కానీ వర్మ కదా.. ఏదో కొత్తగా చేస్తాడు అనుకున్నవారికి ఆఫీసర్ షాకిచ్చాడనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమాపై ఎవరికీ అంచనాల్లేవు. వాటిని పెంచాల్సిన టీజర్ కూడా చప్పగా ఉండటంతో వర్మ ఏం మారలేదు అని అర్థమౌతోంది. నిజానికి ఈ సినిమా మొదలైనప్పుడు కూడా వర్మ తన ‘వేషాలు’ తగ్గించలేదు. ఓ వైపు ఆఫీసర్ ను హోల్డ్ లో పెట్టేసి ‘జీఎస్టీ’ తీస్తూ ఉండిపోయాడు. అప్పుడే నాగార్జున వర్మపై గుస్సా అయ్యాడు అన్నారు. తర్వాత ఎలాగో సెటిల్ చేసుకుని మళ్లీ సెట్ అయ్యారు. కానీ వర్మ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ కానీ, ఇప్పుడీ టీజర్ కానీ ఆఫీసర్ పై ఏ మాత్రం ఆసక్తిని పెంచలేదు. మరి ఇన్ని చూస్తూ కూడా నాగ్ ఎలా ఊరుకున్నారో కానీ.. నాగార్జున గారూ మీరైనా చెప్పండి సార్.. ఆ వర్మకు.

More Related Stories