English   

ఆఫీస‌ర్ పై నాగార్జున‌.. ఎద‌వ‌లు కాదు..

Nagarjuna on Officer

నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఆఫీస‌ర్. ఈ చిత్రం వ‌చ్చిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. అంత దారుణంగా ఫ్లాప్ అయింది. ఒక్క‌టంటే ఒక్క కోటి కూడా షేర్ తీసుకురాలేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో వ‌ర్మ‌పై ఎలాగూ విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. ఆ ద‌ర్శ‌కుడు కూడా దీనికి సిద్ధంగానే ఉంటాడు. రండి.. వ‌చ్చి ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టుకోండి.. నాకేం ప్రాబ్ల‌మ్ లేదంటాడు. అయితే ఇప్పుడు బోన‌స్ గా వ‌ర్మ‌ను న‌మ్మినందుకు నాగార్జున‌కు కూడా అక్షింత‌లు ప‌డుతున్నాయి. ఆఫీస‌ర్ ప్లాప్ ను నాగ్ కూడా పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోలేద‌ని అర్థం అవుతుంది. సినిమా విడుద‌లైన మూడో రోజే చేయాల్సిన ప్ర‌య‌త్నం చేసాం.. జ‌నాల‌కు న‌చ్చ‌లేదంటూ ఏదో వేదాంతం ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసాడు. దాన్ని బ‌ట్టే సినిమాపై నాగార్జున ఆశ‌లు వ‌దిలేసుకున్నాడ‌ని అర్థ‌మైంది. ఇక ఇప్పుడు ప్రేక్ష‌కుల గురించి మాట్లాడాడు నాగార్జున‌. మ‌నం విష‌యం లేని సినిమాలు చేసి ప్రేక్ష‌కులు చూడ‌మంటే చూడ్డానికి వాళ్లు వెధ‌వ‌లు కాదు.. సినిమా మొద‌లైన ప‌ది నిమిషాల‌కే వాళ్ల‌కు సీన్ అర్థ‌మైపోతుంది.. మ‌న‌మే చీక‌ట్లో ఆడుకుంటున్నాం అంటూ సెటైర్లు వేసాడు నాగార్జున‌. ఇందులో త‌న ఆఫీస‌ర్ కూడా ఉంద‌ని నాగ్ కు కూడా తెలుసు. కానీ త‌ప్ప‌డం లేదు.. సొంత సినిమా అయినా చెత్త సినిమానే క‌దా అందుకే సెటైర్లు వేసాడు నాగార్జున‌. విష‌యం ఉంటే మ‌హాన‌టి.. రంగ‌స్థ‌లం లాంటి సినిమాలు వ‌స్తాయ‌ని.. ఇంకా ప‌క్క భాష‌ల‌తో పోలిస్తే మ‌న ద‌గ్గ‌ర అలాంటి సినిమాలు త‌క్కువ‌గా వ‌స్తున్నాయంటున్నాడు నాగార్జున‌. మ‌రి అలాంటి క‌థ‌ల‌వైపు అంద‌రికంటే ముందు నాగార్జున‌నే వెళ్తే మంచిదేమో క‌దా అంటున్నారు విశ్లేష‌కులు. వాళ్ల మాట కూడా తీసుకుంటున్నాడు నాగార్జున. 

More Related Stories